జూ ఎన్టీఆర్ కంటే ఘనంగా రామ్ చరణ్-ఉపాసనా కామినేని పెళ్ళి..!
సినీ హీరోల పెళ్లిల్లు జోరుగా జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన పెళ్ళిళ్ళలో ఎన్టీఆర్ పెళ్ళి చాలా సాంప్రదాయ పద్దతి ప్రకారం మరియు ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ పెళ్ళిక ముందు అల్లు అర్జున్ పెళ్ళి బాగా జరిగిందని ఫిలిం పరిశ్రమలో మంచి పేరు వచ్చింది. ఎన్టీఆర్ పెళ్ళితో, అల్లు అర్జున్ పెళ్ళి రెండవ స్థానానికి వెళ్ళిందని మెగా ఫ్యామిలీలోనే చర్చలు జరిగినట్లు తెలుస్తున్నాయి.
అయితే మెగాస్టార్ తనయుడు 'రామ్ చరణ్ తేజ్" వివాహం ఎన్టీఆర్ పెళ్ళి కంటే బాగా జరపాలని మెగా ఫ్యామిలీ పట్టుదలతో ఉందని ఫిలిం నగర్ న్యూస్. ఎన్టీఆర్ తన తాత ఫోటో, ముత్తాత ఫోటోలను వెడ్డింగ్ కార్డ్ పై ముద్రించి పెళ్ళి సాంప్రదాయాన్ని చాలా గొప్పగా చాటాడు. కానీ ఎన్టీఆర్ కేవలం తండ్రివైపు తరుపున ఉన్న వారినే వెడ్డింగ్ కార్డులపై ముద్రించాడు. తన తల్లి తరుపున వారి ప్రసక్తే లేదు.
కానీ రామ్ చరణ్ తండ్రివైపు, తల్లివైపు తరుపున తాత ముత్తాతలను ముద్రించే అవకాశం ఉంది. తల్లివైపున పద్మశ్రీ అల్లు రామలింగయ్య, తండ్రి వైపు కొనిదెల వెంట్రావు, ఆయన తల్లిదండ్రులను వెడ్డింగుకార్డులపై ముద్రిస్తారని తెలుస్తుంది. ఇక సాంప్రదాయాల విషయంలో కూడా ఎన్టీఆర్ పెళ్ళిసాంప్రదాయాలను మించి చేస్తారని తెలుస్తుంది. ఫిలింనగర్ న్యూస్ ప్రకారం 'రామ్ చరణ్" అపోలో హాస్పిటల్ ఛైర్మన్ కూతురు 'ఉపాసనా"ను చేసుకుంటాడని రూమర్స్ వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











