చివరగా పవన్ కళ్యాణ్‌‌తో ఇప్పుడు శేఖర్ కమ్ములతో?

By Bojja Kumar

అప్పుడెప్పుడో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన 'పులి' చిత్రంలో ఐటమ్‌సాంగ్‌లో కనిపించిన శ్రియ ఆ తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు. తాజా సమాచారం ప్రకారం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' చిత్రంలో శ్రియ నటించబోతుందని తెలిసింది. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో నటించడానికి దర్శకుడు శేఖర్ కమ్ముల శ్రియను సంప్రదించాడని, అందుకు ఈ భామ ఓకే చెప్పిందని ఫిల్మ్‌నగర్ సమాచారం.

లీడర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వత శేఖర్ కమ్ముల 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అందరూ నూతన తారలతో శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫస్ట్ టైమ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. హ్యాపిడేస్ తరహాలోనే ఈ చిత్రం కోసం రాష్ట్రవ్యాప్తంగా స్టార్ హంట్ నిర్వహించి కొత్త ఆర్టిస్టులను ఎంపిక చేశారు. కాలేజీ అనంతర కాలపు జీవితం ఎలా ఉంటుందో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు శేఖర్ కమ్ముల.

ఈ చిత్రాన్ని దక్కించుకోవడానికి ఎగ్జిబిటర్లు, బయ్యర్లు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తక్కువ బడ్జెట్ తో ఆయన నిర్మించే సినిమాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి కాబట్టే ఈ పోటీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X