బాలకృష్ణ అంటే ఇక భయపడతారా?

By Srikanya

బాలకృష్ణ అంటే మీడియాలో ఓ వర్గానికి భలే లోకువ.వాళ్ళు ఆయనపై జోకులు క్రియేట్ చేయటం..వాటిని నెట్ ద్వారాను,ఎస్.ఎమ్మెస్ ల ద్వారాను స్ర్రెడ్ చేస్తూ ఆనందిస్తూంటారు.దీనిపై బాలయ్య ఆ మధ్యన సీరియస్ అయ్యి యాక్షన్ లోకి దిగారు కూడా.ఐ హేట్ బాలయ్య వెబ్ సైట్ వారిపై కేసులు పెట్టి వెతికించి పట్టుకునే ప్రయత్నం చేసారు.అయినా దేనిగొడవ దానిదే అన్నట్లు ఆ తాకిడి తగ్గలేదు.అయితే ఇప్పుడు అవి ఇక తగ్గే అవకాశం ఉందని పరిశ్రమలోని వారు అంటున్నారు.దానికి కారణం బాలయ్య త్వరలో శ్రీరాముడుగా కనిపించనుండటమే.బాపు దర్సకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో బాలకృష్ణ శ్రీరాముడుగానూ,నయనతార సీతగానూ చేసారు.

ఈ సినిమా చూసిన తర్వాత దేముడు క్యారెక్టర్ వేసిన వ్యక్తిపై జోకులు వేయటానకి జంకుతారని,గ్యారెంటీగా ఆ భయం పనిచేస్తుందని చెప్తున్నారు.అదెంతవరకూ పనిచేస్తుందోకానీ అభిమానులు మాత్రం కొంతలో కొంత అని ఊరట చెందుతున్నారు.ఇక ఈ చిత్రాన్ని దసరా రోజున అంటే అక్టోబర్ ఆరవ తేదీన విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇక వారం క్రితం విడుదలైన శ్రీరామరాజ్యం ఆడియో మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

గతంలో రామారావు గారు నటించిన లవకుశ కళాఖండాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దృశ్య కావ్యాన్ని తెరకెక్కించారు. శ్రీరాముని జననం నుంచి రావణాసుర సంహారం వరకూ పదినిషాల పాటలో ఆ కథంతా ఉంటుంది. ఇప్పటికీ భారతావని అంతా రామరాజ్యం రావాలి అంటూ అనుకుంటూ ఉంటుంది. ఆ రామరాజ్యం ఎలా ఉండేది. రాముని విశిష్టత ఏమిటి.. అన్న విశేషమే శ్రీరామ రాజ్యం అని నిర్మాతలు చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X