»   » అల్లరి నరేష్ కి ‘బిస్కెట్ ’ వేసిన డైరక్టర్

అల్లరి నరేష్ కి ‘బిస్కెట్ ’ వేసిన డైరక్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లరి నరేష్ అంటే మినిమం గ్యారెంటీ హీరో. దాంతో అతనితో చాలా మంది దర్శకులు సినిమాలు చేయటానికి ఉత్సాహం చూపిస్తూంటారు. అయితే నరేష్ సైతం చాలా జాగ్రత్తగా స్క్రిప్టులు ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ నేపధ్యంలో అతనితో సినిమా చెయ్యాలంటే ఓ మాదిరి దర్శకులకు పెద్ద టాస్కే. ఈ నేపధ్యంలో భాయ్ వంటి డిజాస్టర్ చిత్రం ఇచ్చిన వీరభధ్రం అతనితో సినిమా చేస్తూండటం అంతటా హాట్ టాపిక్ గా మారింది. అయితే అతను వేసిన బిస్కట్ అలాంటిది అంటున్నారు. ఆ బిస్కట్ ఓ మళయాళి సినిమా అని చెప్పుకుంటున్నారు.

గతంలోనూ వీరభద్రం తన తొలి చిత్రాన్ని మ్యారియింగ్ మాఫియా అనే చిత్రం నుంచి ఎత్తి అల్లరి నరేష్ తో అహనా పెళ్లంట అనే చిత్రం, మళయాళ చిత్రం పండిపడ ని ఎత్తి సునీల్ తో పూల రంగడు, మరో మళయాళ చిత్రం ఆధారంగా నాగార్జునతో భాయ్ చిత్రం చేసారు. దాంతో ఆయన ఏ చిత్రం చేసినా రిఫెరెన్స్ లేనిదే చేయడు కాబట్టి...ఈ సారి సైతం మళయాళం చిత్రం తీసుకుని చేస్తున్నాడని చెప్పుకుంటున్నాడు. అది నిజమే కాదో కానీ ఆ చిత్రానికి మాత్రం 'బిస్కెట్ రాజా' అనే టైటిల్ పెట్టాడంటున్నారు. ఈ మధ్యనే 'బిస్కెట్ ' టైటిల్ తో ఓ చిత్రం వచ్చి భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. మే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్ళే ఈ చిత్రాన్ని జె.భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం అల్లరి నరేష్... జంపు జిలాని టైటిల్ తో ఇ.సత్తిబాబు దర్శకత్వంలో రూపొందే చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో కథ వజ్రాల వేట ప్రధానంగా సాగుతూ కామెడీ పంచుతుంది. తమిళంలో ఘనవిజయం సాధించిన 'కలగలప్పు' చిత్రానికి రీమేక్ ఇది. శ్రీవెంకటేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ పతాకంపై అంబికా రాజా నిర్మిస్తున్నారు. రిలియన్స్ వారు ఫైనాన్స్ చేస్తున్నారు. అల్లరి నరేష్ తొలి ద్విపాత్రాభినయం ఇది.

Will this ‘biscuit’ work for Allari Naresh ?

సమర్పకులు అంబికా కృష్ణ మాట్లాడుతూ ''కలగలుపు అనే తమిళ చిత్రానికి రీమేక్‌ ఇది. ఈవీవీ సత్యనారాయణతో నాకు మంచి అనుబంధం ఉంది. మా సంస్థకు 'కన్యాదానం'లాంటి సినిమా ఇచ్చారు. ఇప్పుడు నరేష్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉంది''అన్నారు.అంబికా, అంబానీ, అల్లరి నరేష్ అనే మూడు శక్తులతో ఈ సినిమా రూపొందుతోందని వ్యాఖ్యానించారు. ఈవీవీతో తనకు, తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందనీ, ఆయన కుమారుడు అల్లరి నరేష్ తన కొడుకులాంటివాడేననీ అన్నారు.

అల్లరి నరేష్ మాట్లాడుతూ.... ''సీమశాస్త్రిలోని సుబ్రహ్మణ్యశాస్త్రి పాత్ర 'గమ్యం'లో గాలిశీను కలిపితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో నా పాత్ర అలా ఉంటుంది''అన్నారు‌. తమిళంలో 'కలగలప్పు' చిత్రాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశామన్నారు. హీరోగా ద్విపాత్రాభినయం చేయడం సంతోషంగా ఉందని, నాన్నగారి (ఈవీవీ) 'హలోబ్రదర్' తరహాలో ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించబోతున్నామని నరేష్ అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ... '' 'తాతల ఆస్తుల కోసం ఆరాటపడే వారసుల గురించే మనకు తెలుసు. కానీ, మా హీరో తాతల పేరు నిలబెట్టడానికి, వారి వారసత్వాన్ని కాపాడుతాడు. అందుకోసం అతను ఎదుర్కొన్న సంఘటనల సమాహారమే ఈ చిత్ర కథ హలో బ్రదర్‌ నాగార్జునకు ఎంత పేరు తీసుకొచ్చిందో.. మా సినిమా నరేష్‌కు అంత పేరు తీసుకొస్తుంది. తొలిసారి నరేష్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఒకటి పాత్ర క్లాస్‌. మరోటి మాస్‌. తరతరాలుగా వస్తున్న ఆస్తిని హీరో ఎలా కాపాడుకొన్నాడు అనేదే ఈ చిత్ర కథ.'' అన్నారు. కథ: సుందర్‌ సి, సంగీతం: విజయ్‌ ఎబెంజర్‌, సమర్పణ: రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, అంబికా కృష్ణ అండ్‌ బ్రదర్స్‌

English summary

 Director Veerabhadram, with a confidence and perseverance is again attempting another movie and this time with Allari Naresh, named as ‘Biscuit Raja’. Director Veerabhadram made directorial debut with the movie ‘Aha Na Pellanta’ starring Allari Naresh, Srihari and Brahmanandam and then it was a super hit.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu