ఈ ఒక్క పోస్టర్ చాలు...గొడవలు ఖాయం (ఫొటో)
ముంబై: టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ వంటి ప్రమోషన్ తో ఓపినింగ్స్ రప్పించాలి...ఓవర్ నైట్ లో బిజినెస్ జరిగిపోవాలి ఇదీ టాలీవుడ్, బాలీవుడ్ వాళ్లు అనుసరిస్తున్న వ్యూహం. అందులో భాగంగా అవకాసం ఉంటే కాంట్రావర్శికి దిగుతున్నారు. ఇప్పుడు మల్లికా షెవారత్ పెట్టుకుని డర్టీ పాలిటిక్స్ సినిమా చేస్తున్నవారు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. రీసెంట్ గా వారు విడుదల చేసిన పోస్టర్ అంతటా చర్చనీయాంశంగా మారింది. జాతీయ జెండాని అవమానిస్తున్నట్లు ఈ పోస్టర్ ఏ వివాదాలకు తెరతీస్తుందో అని బాలీవుడ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
మర్డర్ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన తార మల్లికా శరావత్. ఆ సినిమాలో మల్లికా అందాల ప్రదర్శన, ఘాటైన ముద్దు సీన్లు ఆమెకు ఎనలేని క్రేజ్ తేవడమే కాదు, అనతి కాలంలో ఊహించని పాపులారిటీ సంపాదించింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ భాగానే సాగినా ప్రస్తుతం మాత్రం ఏమంత సంతృప్తి కరంగా లేదు. ఈ నేపధ్యంలో ఆమె కాంట్రావర్శి ఉన్న సబ్జెక్టులతో ముందుకు రావాలనే నిర్ణయం తీసుకుంది.

మల్లిక ...రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' జీవితం ఆధారంగా నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వెండి తెరపై శృంగారాన్ని ఒలికించిన మల్లికా శెరావత్ ఈ చిత్రంలో పల్లెటూరు పడుచుగా కనిపించబోతోంది. గ్లామర్‌కి ఆస్కారం లేని పాత్రలో పిడకలు చేసుకొంటూ కెమెరా ముందు నటిస్తోంది. ఇక ఈ చిత్రం టైటిల్ 'డర్టీ పాలిటిక్స్'. రాజస్థాన్‌లో రెండేళ్ల కిందట వెలుగుచూసిన భన్వరీదేవి ఉదంతం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. కె.సి.బొకాడియా దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరికి చెందిన గృహిణిగా మల్లిక పాత్ర ఉంటుంది. కొందరు రాజకీయ నాయకుల మూలంగా ఆమె జీవితం ఎలా ఇబ్బందులు పాలైందో చూపించబోతున్నారు.
ఇంతకుముందు మల్లికా శరావత్ ఎప్పుడూ ఏదో ఒక న్యూసెన్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచేది. కానీ ఇప్పుడు టచ్‌లోనే లేదు. ఇటీవలి కాలంలో మీడియాకి అమ్మడు పూర్తిగా దూరమైపోయింది. చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడంతో ఈవిడని అంతా మర్చిపోయారు. అప్పట్లో హిస్ సినిమా టైమ్‌లో ప్రమోషన్ కోసం ముంబై, హైదరాబాద్, గోవా అంటూ అన్నిచోట్లా తిరిగింది. అప్పుడు మీడియా అంతా ఈవిడ వెంట తిరిగింది. ఇప్పుడామెను పట్టింకునే వారే కరువయ్యారు. అందుకే ఇలాంటి పోస్టర్స్ .


Click it and Unblock the Notifications











