ప్చ్...వెంకటేష్ మళ్లీ తప్పు చేస్తున్నాడా?

అక్షయ్ కుమార్, పరేష్ రావల్ నటించిన 'ఓ మై గాడ్' చిత్రం మంచి విజయం సాధించింది. 'ఓ మై గాడ్' రీమేక్ హక్కుల్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ చేజిక్కించుకొంది. అక్షయ్ కుమార్ పాత్రలో వెంకటేష్ నటిస్తారని తెలిసింది. పరేష్ రావల్ పాత్ర ఎవరికి దక్కుతుందనేది తేలాల్సి ఉంది. స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. దర్శకుడిని త్వరలోనే ప్రకటిస్తారు. అయితే కృష్ణుడు పాత్రలో వెంకటేష్ ఎంతవరకూ రాణిస్తాడనేది చూడాల్సిన విషయ.
ఓ ప్రక్కన స్క్రిప్టు వర్క్ జరుగుతున్న ఈ చిత్రం విషయంలో ఇంకా డైలమోలో ఉన్నట్లు సమాచారం. వరసగా నాగవల్లి, బాడీగార్డ్, మసాలా రీమేక్ చిత్రాలు డిజాస్టర్ ఫలితాలు పొందటంతో రీమేక్ చేద్దామా...స్టైయిట్ చిత్రం చేద్దామా అనేది తేల్చుకోలోకపోతున్నాడని చెప్పుకుంటున్నారు. అయితే సురేష్ బాబు మాత్రం ఈ సారి ఖచ్చితంగా 'ఓ మై గాడ్' రీమేక్ ఘన విజయం సాధిస్తుందని భావిస్తున్నట్లు సమాచారం.
వెంకటేష్ లాంటి మంచి నటుడు ఇలా రీమేక్ చట్రంలో ఇరుక్కోపోవటం మాత్రం ఆయన అభిమానులకు రుచించటం లేదు. ఓ మైగాడ్ చిత్రం కాన్సెప్టు ఇక్కడ మన తెలుగు వారికి ఎంత వరకూ ఎక్కుతుందనే సందేహం వెళ్లబుచ్చుతున్నారు. గతంలోనూ నాగార్జున ...మంచు విష్ణు తో కలిసి కృష్ణార్జున అనే చిత్రం చేసారు. అందులో ఆయన మోడ్రన్ శ్రీకృష్ణుడుగా కనిపించారు. కానీ ఆ సినిమా భాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ అలాంటి పాత్రనే వెంకటేష్ చేయబోతున్నారు.


Click it and Unblock the Notifications











