ఒకటైపోయిన అల్లు అర్జున్ , పవన్ .. ఆ ఫ్యాన్స్‌కి జీర్ణం కావడం లేదట?

గత కొన్నాళ్ల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు సినిమాతో ముడిపడి ఊహించని విధంగా కాంట్రవర్సీలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనికి చాలా కారణాలు ఉంటే వాటిలో మెగా కుటుంబంకి చెందిన స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల నడుమే చాలా వివాదాలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి. అల్లు అర్జున్.. ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కోసం కాకుండా తన ఫ్రెండ్ వేరే పార్టీలో ఉన్న శిల్ప రవి కోసం స్వయంగా వెళ్లి ప్రచారం చేయడం అనేది పెద్ద దుమారమే రేపింది.

ఈ సంఘటన మెగా అండ్ అల్లు అభిమానులు నడుమ పెద్ద చీలికే తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తర్వాత చేసిన పలు కామెంట్స్ ఇంకోపక్క మెగా సోదరుడు నాగబాబు చేసిన కామెంట్స్ కూడా చర్చలకి దారి తీస్తూ ఒక హీట్ వాతావరణం మెగా కుటుంబం చుట్టూ కనిపించింది. ఇదే అదునుగా తీసుకొని ఏపీలో ఓ పార్టీ శ్రేణులు అల్లు అర్జున్ ని అక్కున చేర్చుకొని పవన్ ని టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారు.

with allu arjun latest step on pawan kalyan ycp fans disappointed

ఈ క్రమంలోనే మెగా అండ్ అల్లు ఫామిలీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కూడా ఎక్కువే జరిగింది. దానికి తోడు ఏపీలో టికెట్ ధరల విషయంలో కూడా సస్పెన్స్ పెరగడంతో సోషల్ మీడియాలో మెగా అండ్ అల్లు ఫ్యాన్స్ మధ్య ఓ రేంజ్‌లో గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. వీటికి మధ్యలో వైసీపీ ఫ్యాన్స్ కలుగజేసుకోవడమే కాదు.. మెగా అభిమానులు పుష్ప 2 ని బాయ్ కాట్ చేస్తే మేము చూస్తాం అంటూ అల్లు అర్జున్ కి చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.

కానీ సీన్ కట్ చేస్తే ఒక మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ని అల్లు అర్జున్ అందించాడు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన పుష్ప 2 ది రూల్ సక్సెస్‌మీట్‌లో కీలక వ్యాఖ్యలు చేశాడు బన్నీ. టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అవకాశం కల్పించిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు థ్యాంక్స్ చెప్పారు. ఇదే సమయంలో పవన్ పట్ల పాజిటివ్‌గా మాట్లాడటమే కాదు.. మరీ పర్శనల్ గా కళ్యాణ్ బాబాయ్ కి థాంక్స్ చెబుతున్నాను అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ ఆ పార్టీ కేడర్‌కి ఫ్యూజ్‌లు ఎగిరిపోయేలా చేశాయట.

with allu arjun latest step on pawan kalyan ycp fans disappointed

దీనితో అల్లు అర్జున్ పై సోషల్ మీడియాలో వారు అసలు రంగులు బయట పెడుతున్నారు. బన్నీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నీకోసం తాము నిలబడితే ఇప్పుడు అల్లు అర్జున్- పవన్ కలిసిపోయారు అంటూ తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. దీనిని బట్టి అల్లు అర్జున్ మాత్రం వారిని మామూలు దెబ్బ కొట్టలేదని చెప్పాలి. ఇదే కాకుండా చాలా మంది వైసీపీ నాయకులు కూడా అల్లు అర్జున్ కి సపోర్ట్ చేసినప్పటికీ పవన్ తరపున బన్నీ మాట్లాడటం వారికి జీర్ణం కావట్లేదని టాక్ వినిపిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X