పూరీ అది ఓకే చేస్తేనే బాలకృష్ణ ప్రాజెక్టు స్టార్ట్?

By Srikanya

పూరీ జగన్నాధ్ తను రాసుకున్న రెండు కథలను ఇప్పటికే బాలకృష్ణ కు చెప్పటం అవి రిజక్టు కావటం అనే సంగతులు తెలిసినవే. దాంతో బాలకృష్ణం ఈ విషయమై...పూరి జగన్నాథ్ కథ నచ్చకపోవడంతో నేను కాంప్రమైజ్ కానని ఆయనకు చెప్పేశాను. కథ ముఖ్యమండి. దాని తర్వాతే ఏదైనా.. పూరీ జగన్నాధ్ కథ ఓకే అయితే ఈరోజు నుంచి షూటింగ్ ప్రారంభించి, విజయదశమికి సినిమాని విడుదల చెయ్యాలనుకున్నాం అని స్టేట్ మెంట్ ఇచ్చేసాడు. దాంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయిందనే అంతా భావించారు. అయితే తాజాగా మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది.

ఢీ,అదుర్స్ వంటి అనేక చిత్రాలకు కథ అందించిన కోన వెంకట్ చెప్పిన కథ బాలయ్యకు నచ్చిందట. ఆ కథతో పూరి జగన్నాద్ తో సినిమా చేద్దామని బాలయ్య నిర్ణయించుకుని నిర్మాత బెల్లంకొండతో చెప్పాడని సమాచారం. పూరి చేస్తానంటే వచ్చే నెల 7న ప్రారంభం చేద్దామని క్లియర్ గా చెప్పాడుట. కాని వేరే రచయిత కథతో సినిమా చేయటానికి పూరి మాత్రం సముఖంగా లేరని తెలుస్తోంది. ఇక పూరీ నిర్ణయం అని బాలయ్య ఈ విషయమై కలగచేసుకోవటానకి ఇష్టపడటం లేదు. మరి పూరీ తీసుకునే నిర్ణయంపై ఈ చిత్రం ప్రారంభం కానుందా లేదా అనేది ఆధారపడుతుందని చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X