ఒక్క "పుష్ప 2" .. మెగా వర్సెస్ నందమూరి గొడవలు .. బన్నీ చిరంజీవిని అవమానించాడా?

సాధారణంగా మన తెలుగు సినిమా దగ్గర ఓ స్టార్ హీరో సినిమా కానీ మంచి అంచనాలు ఉన్న పాన్ ఇండియా సినిమా కానీ వచ్చింది అంటే ఆ హంగామా వేరే లెవెల్లో ఉంటుంది. సరిగ్గా ఇపుడు ఇదే పరిస్థితి తెలుగు రాష్ట్రాలు సహా ఇండియన్ సినిమా వైడ్ గా కనిపిస్తుంది. ఆ వేడుకలే ఇపుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అవైటెడ్ చిత్రం "పుష్ప 2" కి కనిపిస్తున్నాయి.

ఇలా ఇండియా మొత్తం పుష్ప 2 మేనియా కనిపిస్తూ ఉంటే ఒకపక్క మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఇతర హీరోల అభిమానులు తన్నుకుంటున్నారు. ఇది వరకు ఒక బిగ్ స్టార్ సినిమా వస్తే తనకి పోటీ లేదా సరి సమానమైన హీరో అభిమానుల నడుమ ఫ్యాన్ వార్స్ జరిగేవి. కానీ ఇపుడు పుష్ప 2 సినిమా వస్తే ఇంట్రెస్టింగ్ గా సోషల్ మీడియా వేదికగా పుష్ప 2 పేరు చెప్పుకొని నందమూరి అభిమానులు అలాగే మెగా అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేసుకుంటూ ఉండడం గమనార్హం.

with pushpa 2 release mega and nandamuri fans started war

సినిమా ఇలా ప్రీమియర్స్ పడ్డాయో లేదో అందులో పలు డైలాగ్స్ తో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఇంకోపక్క మెగా అభిమానులు ఎన్టీఆర్ కోసం తన్నుకుంటున్నారు. పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ ఎంట్రీలో ఓ డైలాగ్ చెబుతాడు. '' బాస్ ఎవ్వడు లేడు నీ బాస్ కి వాడి తమ్ముడికి వాడి కొడుక్కి అందరికీ నేనే బాస్‌‌ని '' అంటూ చెప్పిన డైలాగ్ మెగా హీరోస్ కౌంటర్‌లా ఉందంటూ ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.

కాగా ఆ డైలాగ్ ఎందుకు మెగా ఫ్యామిలీ హీరోస్ తో సింక్ అయ్యింది అంటే టాలీవుడ్ లో వన్ అండ్ ఓన్లీ బాస్ అంటే మెగాస్టార్ చిరంజీవి అనే అంటారు అంతా.. అలాంటిది తన కొడుకు, తమ్ముడు అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, పవర్ స్టార్ కళ్యాణ్‌ల కోసమే ఈ డైలాగ్ పెట్టారు అంటున్నారు. ఇపుడు మెగా హీరోస్‌తో అల్లు అర్జున్‌కి తన ఫ్యాన్స్‌కి అంత సఖ్యత లేదు అనే మాట వాస్తవే. కానీ ఈ గొడవలు జరగడానికి ముందే ఎప్పుడో ఈ సీన్స్ ని తీసేసారు.

with pushpa 2 release mega and nandamuri fans started war

కానీ ఈ డైలాగ్స్ అల్లు అర్జున్ కావాలనే మెగాస్టార్ చిరంజీవిని అవమానించేలా చెప్పాడు అంటూ నిజానిజాలు తెలుసుకోకుండానే వైరల్ చేస్తున్నారు. దీనితో ఎన్టీఆర్ పై కూడా మెగా అభిమానులు పర్సనల్‌గా ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా పుష్ప 2 సినిమా రిలీజ్ అవ్వడం ఏంటో కానీ చిరకాల ప్రత్యర్ధులు మెగా అండ్ నందమూరి ఫ్యాన్స్ మాత్రం మళ్ళీ గొడవలు స్టార్ట్ చేసారని చెప్పాలి. మరో వైపు పుష్ప 2 మాత్రం భారీ బుకింగ్స్ తో ఇండియన్ సినిమా వైడ్ గా వీరి హైయెస్ట్ లని ఈజీగా కొట్టేసే దిశగా వెళుతుంది.

More from Filmibeat

Read more about: allu arjun pushpa 2 sukumar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X