ఎన్టీఆర్ సలహాతోనే అల్లు అర్జున్ మ్యారేజ్ న్యూస్ లీక్ !?
అల్లు అర్జున్ త్వరలో స్నేహా రెడ్డి ని వివాహం చేసుకోబోతున్నారని, గత కొంత కాలంగా వీరు మధ్య ప్రేమ నడుస్తున్న విషయాన్ని ముందుగా స్టూడియో ఎన్ వారు ప్రసారం చేసారు. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ దగ్గరుండి ఆ న్యూస్ లీక్ చేయించాడని అంతటా చెప్పుకుంటున్నారు. దానికి కారణం..అల్లు అర్జున్ ఇంట్లో వారు తమ ప్రేమ పెళ్ళికి ఒప్పుకోకపోవటంతో ఎన్టీఆర్ సలహా అడిగాడని, మీడియాలో న్యూస్ వచ్చేస్తే ఇక చేసేదేమీ ఉండదని ఈ యంగ్ హీరోలిద్దరూ ఓ నిర్ణయానికి వచ్చి ఎన్టీఆర్ మామగారి ఛానెల్ లో ఈ న్యూస్ ని వదిలారని చెప్తున్నారు. లేకపోతే చాలా కాలం నుండి జరుగుతున్న ఈ ప్రేమ వ్యవహారం మీడియాలో తెల్సినప్పటికీ అల్లు ఫ్యామిలీతో తలనొప్పులు తెచ్చుకోవటం ఎందుకన్నట్లుగా దాచి పెట్టి ఉంచారు కదా. అలాంటిది హఠాత్తుగా ఎవరి ధైర్యంతో ఈ న్యూస్ వేయాలనే నిర్ణయం తీసుకున్నారు అంటే ఎన్టీఆర్ అండతోనే అని తేలుస్తున్నారు. ఇక ఎన్టీఆర్, అల్లు అర్జున్ మంచి స్నేహితులు కావటం ఇక్కడ కలిసి వచ్చిన అదృష్టం అని, మీడియాను ఇలా చక్కగా తన ఇంట్లో వాళ్ళను కంట్రోల్ లో పెట్టడానికి కూడా వాడుకోవచ్చునని నిరూపించారని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











