పుష్ప 2 మూవీకి మరో షాక్.. ఇది నిజమా? రుమరా?
ప్రస్తుతం టాలీవుడ్ సినిమా నుంచి రాబోతున్న పలు బిగ్గెస్ట్ అండ్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రాల్లో ట్రూ పాన్ ఇండియా హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న సెన్సేషనల్ సీక్వెల్ చిత్రం "పుష్ప 2" పైనే అందరిలో ఎక్కువ దృష్టి ఉందని చెప్పాలి. ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన సీక్వెల్ చిత్రాలు బాహుబలి, కేజీయఫ్ చాప్టర్ 2 ల తర్వాత ఈ సీక్వెల్ పైనే భారీ హైప్ సెట్ అయ్యింది. దీనితో డిమాండ్ కూడా గట్టిగానే ఉండడంతో చిత్ర యూనిట్ లో కూడా ఒత్తిడి ఉంది.
కానీ మేకర్స్ చాలా సాఫీగా నెమ్మదిగానే సినిమాని చేస్తూ వస్తున్నారు. కాకపోతే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. మొదట ఒక డేట్ అనుకొనే నెమ్మదిగానే షూటింగ్స్ స్టార్ట్ చేశారు. కానీ అది పూర్తి స్థాయిలో అనుకున్న విధంగా పూర్తి కాలేదు. దీనితో షూటింగ్ అలా గడుస్తూ ఉంది తప్ప సరైన అవుట్ పుట్ రావడం లేదు అని ఇన్సైడ్ టాక్. దీనితో ఇంకా చాలా పనులు పెండింగ్ లో పడ్డాయి.

సినిమాకి వర్క్ చేస్తున్న ఇతర టెక్నీషియన్స్ లో కూడా అసహనం మొదలైంది అని రూమర్స్ ఉన్నాయి. కాగా గత కొన్ని రోజులు నుంచి షాకింగ్ ఇన్సిడెంట్ లు ట్విస్ట్ లు ఈ సినిమా విషయంలో వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కి దర్శకుడు సుకుమార్ కి నడుమ కోల్డ్ వార్ నడుస్తుంది అని సుకుమార్ ఒకలా ప్లాన్ చేస్తే బన్నీ ఇంకోలా డీల్ చేస్తున్నాడని కొన్ని షాకింగ్ రూమర్స్ సోషల్ మీడియాని షేక్ చేసాయి.
కరెక్ట్ గా సుకుమార్ విదేశాల నుంచి ఇండియాకి వచ్చి షూటింగ్ స్టార్ట్ చేసే సమయంలో అల్లు అర్జున్ వెకేషన్ అంటూ విదేశాలకి వెళ్ళాడు. పైగా పుష్ప 2 కోసం రెడీ చేసిన గడ్డం లుక్ కూడా మార్చివేయడం మరింత చర్చకి దారి తీసింది. కాగా ఈ ఊహించని అంశాలతో పుష్ప 2 మేటర్ హాట్ టాపిక్ గా నడుస్తుండగా ఈ గందరగోళంలో సినిమా అసలు ఎటు వెళ్తుందో అని ఈ సినిమాకి వర్క్ చేస్తున్న కో డైరెక్టర్ ఒకరు ఈ సినిమాకి వర్క్ చెయ్యడం నా వల్ల కాదని బయటకి వచ్చేసినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి.

కాగా అనుకున్న దానికంటే పుష్ప 2 ఆలస్యం అవ్వడం, పైగా ఈ కోల్డ్ వార్ లు చూసి అతడు బయటకి వచ్చేసి మరో భారీ సినిమాకి వర్క్ చెయ్యడానికి వెళ్లిపోయాడని బోగట్టా. కాగా ఆ సినిమా కూడా రెబల్ స్టార్ ప్రభాస్ ఇంకా దర్శకుడు హను రాఘవపూడి సినిమా అన్నట్టుగా కూడా వినికిడి. ఇలా మొత్తానికి అయితే పుష్ప 2 సినిమా విషయంలో ఉండి ఉండి అంతా వేరే విధంగా మారేలా ఉందని చెప్పాలి. మరి అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో నిజంగానే సుకుమార్ కి అల్లు అర్జున్ కి చెడిందా? అనే ఇతర కారణాలకి కాలమే సమాధానం చెప్పాలి.


Click it and Unblock the Notifications











