ఆమె లేని జీవితం సూన్యం ఆమె కోసం కోట్లు కుమ్మరించమన్నా కుమ్మరిస్తాను....
ఎడారిలో ఒయాసిస్సులా తన జీవితంలో ప్రవేశించిన తార నయనతార అని, తాను పుట్టెడు దు:ఖంలో మునిగిపోయినప్పుడు తనను ఓదార్చి అక్కున చేర్చుకున్న ఆమెను వదలి ఒక్క క్షణం కూడా ఉండలేనని ఈ మధ్య ప్రభుదేవా బహిర్గతం చేశాడు. త్వరలో నయనతారను వివాహమాడబోతున్నట్లు వెల్లడించాడు. అయితే వీరిద్దరి వివాహానికి ప్రభుదేవా మొదటి భార్య రామలత అడ్డంకిగా మారింది. దీంతో ప్రభుదేవా ఇటీవల నయనతారను వెంటబెట్టుకొని వెళ్లి తన మొదటి భార్యకు బ్రెయిన్ వాష్ చేశాడట. 'నువ్వూ కావాలి...కానీ నీతోపాటు నాకు నయనతార కూడా కావాలి. ఆమెను వదులుకోమంటే నేను ఏమవుతానో నాకే తెలియదు. ఆమె లేని జీవితం శూన్యమే. ఆమెకోసం నీకేం కావాలన్నా ఇస్తాను. ఆఖరికి నా ఆస్తిపాస్తులన్నీ అన్నాడట.
దీంతో రామలత వారిద్దరి ప్రేమ బంధాన్ని చూసి ఇద్దరి మధ్య నుంచి తప్పుకునేందుకు సిద్ధమైందట. అందుకు ప్రతిఫలంగా రామలత ఖాతాలో ప్రభుదేవా కొన్ని కోట్ల రూపాయలు జమ చేశాడట. ఇక మిగిలింది నయనతారను పెళ్లాడి తన ఎడారి జీవితంలో నిత్యం ఒయాసిస్సు ఆనందాన్ని పొందడమే..


Click it and Unblock the Notifications











