వరల్డ్ ఫేమస్ లవర్.. విజయ్ దేవరకొండ క్యారెక్టర్ ఇదే!
టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ మంచి జోష్‌లో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ వారంలోనే షూటింగ్ పూర్తిచేసుకోనుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన ముగ్గురు అందాల భామలు అలరించనున్నారు. రాశి ఖన్నా, కేథరిన్, ఐశ్వర్య రాజేశ్ లతో విజయ్ చేసే రొమాన్స్ ఈ సినిమాలో హైలైట్ కానుందట. ఇక 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా విజయ్ దేవరకొండ క్యారెక్టర్‌కి సంబంధించి ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది.
ఇంతవరకూ విజయ్ దేవరకొండ చేసిన పాత్రలకి పూర్తి భిన్నంగా ఈ రోల్ ఉండనుందని తెలుస్తోంది.

'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంలో విజయ్ దేవరకొండ ఓ కథా రచయితగా కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది. ఆ హీరో రాసే కథలోని పాత్రలు ఒక్కొక్కటిగా తెరపైకి వచ్చే సన్నివేశాలతో ఈ సినిమా రూపొందుతోందని సమాచారం. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై వల్లభ నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను విడుదల కానుందని అంటునప్పటికీ దాన్ని ఏప్రిల్ నెలకు వాయిదా వేశారనేది తాజా సమాచారం.


Click it and Unblock the Notifications











