బ్రహ్మోత్సవం, స్పైడర్ గుణపాఠంతో.. ఇక వారికి దూరం.. ప్రిన్స్ మహేశ్ షాకింగ్ నిర్ణయం!

By Rajababu

Recommended Video

Mahesh Babu As Arjun Reddy, Is Mahesh Lookout For Innovative Stories

ఎంతో ఇష్టపడి చేసిన బ్రహ్మోత్సవం, స్పైడర్ చిత్రాలు ప్రిన్స్ మహేశ్‌బాబుకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఎంతో మంది అభిమానులకు నిరుత్సాహాన్ని కలిగించాయి. అయితే శ్రీమంతుడు ఆడియో కార్యక్రమంలో ఫ్యాన్స్ ఇక నిరాశ పరచను. ఒకవేళ నిరాశ పరిచితే నన్ను క్షమించాలి అని ప్రిన్స్ కోరిన సంగతి తెలిసిందే. తాను చెప్పిన ప్రకారమే ప్రిన్స్ మహేష్ తన కెరీర్‌ను సరైన రీతిలోమలుచుకొనేందుకు సిద్ధమవుతున్నట్టు కనిపిస్తున్నది.

 కొరటాలతో భరత్ అను నేను

కొరటాలతో భరత్ అను నేను

ప్రస్తుతం ప్రిన్స్ మహేష్‌బాబు కొరటాల శివ దర్శకత్వంలో భరత్ అనే నేను చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రానున్న వేసవిలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో ప్రిన్స్ మహేష్ ముఖ్యమంత్రి పాత్రను పోషిస్తున్నారు. కైరా అద్వానీ, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపిస్తారు.

 వంశీ పైడిపల్లితో సినిమా

వంశీ పైడిపల్లితో సినిమా

భరత్ అను నేను సినిమా తర్వాత దర్శకుడు వంశీ పైడిపల్లితో ఓ చిత్రాన్ని చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందనున్నది. ఇలా వరుస చిత్రాల్లో నటిస్తూనే కొత్త దర్శకులతో సినిమా చేయడానికి సిద్ధపడుతున్నారు.

 సందీప్ రెడ్డితో చిత్రం

సందీప్ రెడ్డితో చిత్రం

యువ దర్శకుల నుంచి వచ్చే స్క్రిప్టులు, కొత్త ఐడియాలపై మహేష్ దృష్టిపెడుతున్నట్టు సమాచారం. ఆ క్రమంలోనే అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా చెప్పిన కథకు ఓకే చెప్పినట్టు తెలిసింది. సందీప్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఆ చిత్రానికి షుగర్ ఫ్యాక్టరీ అని పేరు పెట్టినట్టు సమాచారం

కొత్త కథల ఎంపిక కోసం..

కొత్త కథల ఎంపిక కోసం..

సినీ పరిశ్రమలో ఉత్సాహవంతులైన టాలెంటెడ్ డైరెక్టర్ల వద్ద విభిన్నమైన కథలుంటే వాటిని పరిశీలించేందుకు ఓ టీమ్‌ను కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. తన బాడీలాంగ్వేజ్, క్రేజ్, ఇమేజ్‌కు తగిన కథలు ఉంటే లాక్ చేసే విధంగా ముందుకెళ్తున్నట్టు తెలిసింది.

 సీనియర్ డైరెక్టర్లకు నో

సీనియర్ డైరెక్టర్లకు నో

బ్రహ్మోత్సవం, స్పైడర్ లాంటి చిత్రాలతో గుణపాఠం నేర్చుకొన్న నేపథ్యంలో పెద్ద డైరెక్టర్లకు కొద్దికాలం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నారట. ఆ క్రమంలోనే యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్లతో సినిమాలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నారనేది సన్నిహితుల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X