బాలయ్య కోసం ఆసక్తికరమైన కథ సిద్ధం చేస్తున్న రచయిత!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. సినీ వర్గాల్లో ఈ చిత్రం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. బాలకృష్ణే స్వయంగా తన తండ్రి పాత్రలో నటించబోతున్న చిత్రం ఇది. భారీ తారాగణం నడుమ ఈ చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోంది.
ఇదిలా ఉండగా బాలయ్య త్వరలో వివి వినాయక్ దర్శకత్వంలో కూడా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వినాయక్ బాలయ్య కోసం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ పై అధికారిక సమాచారం రావలసి ఉంది.

మరోవైపు ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రముఖ రచయిత గోపి మోహన్ బాలయ్య కోసం ఆసక్తికరమైన కథ సిద్ధం చేస్తున్నాడట. గోపి మోహన్ గతంలో బాలయ్య డిక్టేటర్ చిత్రానికి రచయితగా పనిచేశాడు. పలు సూపర్ హిట్ చిత్రాలకు పనిచేసిన అనుభవం గోపి మోహన్ కు ఉంది. త్వరలోనే బాలయ్యని కలసి కథ వినిపించే ప్రయత్నం గోపి మోహన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











