SSMB 29: హనుమాన్ తరహాలో మహేష్ పాత్ర.. ఆ వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చిన విజయేంద్రప్రసాద్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శకదీరుడు రాజమౌళి తెరపైకి తీసుకురాబోతున్న సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాను ఫ్యాన్ ఇండియా రేంజ్ లో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఫైనల్ కథ సిద్ధమైంది. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయిలో బౌండెడ్ స్క్రిప్టు సిద్ధం చేసుకునే విధంగా రాజమౌళి తన టీం తో చర్చలు జరుపుతున్నాడు. అయితే ఈ సినిమాపై రోజురోజుకు ఊహించని రూమర్స్ అయితే ప్రేక్షకుల్లో అనేక అనుమానాలకు దారితీస్తోంది.

ముఖ్యంగా సినిమా కథకు సంబంధించి మహేష్ పాత్ర హనుమాన్ తరహా పాత్రలో ఉంటుంది అని కూడా వార్తలు వచ్చాయి. అమెజాన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో మహేష్ బాబు హనుమంతుడి తరహా శక్తులతో కనిపిస్తాడు అని కూడా చాలా రకాల కథనాలు వచ్చాయి. అయితే ఆ తరహా కాన్సెప్ట్ అనేది ఎంతవరకు నిజమనే అనుమానాలు వైరల్ అవుతున్న సమయంలో రాజమౌళి తండ్రి కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక వివరణ అయితే ఇచ్చారు.

 maheshbabuhanumarajendhraprasad

ఇప్పటివరకు వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు అని కాకపోతే రాజమౌళి ప్రతి సినిమాలో కూడా చెడుపై మంచి గెలవడం అనే కాన్సెప్ట్ తోనే వస్తోంది ఎన్నో మైథిలాజికల్ కథలలో అలాంటి పాయింట్ తోనే ఎక్కువగా ఉంటాయని అన్నారు. ఇక మహేష్ బాబు సినిమాలో కూడా దాదాపు అదే తరహాలో ఉండవచ్చు. ఇది అడ్వెంచర్ మూవీ గానే తెర పైకి రాబోతోంది. ఇంకా పూర్తిస్థాయిలో కథ ఏమీ సిద్ధం కాలేదు అని తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుంది అని కూడా కే విజయేంద్ర ప్రసాద్ తెలియజేశారు.

ఇక ఆయన అలా వివరణ ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో మరింత వైరల్ అయ్యాయి. వీలైనంత తొందరగా ప్రాజెక్టును స్టార్ట్ చేయాలి అని రాజమౌళి అనుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 28వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రానుండగా రాజమౌళి ప్రాజెక్టు 2024 సమ్మర్లో మొదలుపెట్టే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X