twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అయితే జూ. ఎన్టీఆర్.... హ్యాండ్ ఇచ్చినట్లే ?

    By Srikanya
    |

    Writer Vakkantham Vamsi waiting for NTR nod
    హైదరాబాద్ : అశోక్,ఊసరవెల్లి చిత్రాలకు కథలు అందించిన వక్కంతం వంశీ గత కొంత కాలంగా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఎన్టీఆర్ తనకి డైరక్టర్ గా ఛాన్స్ ఇస్తానని అనటంతో స్క్రిప్టు పూర్తిగా రెడీ చేసుకుని మరీ వెయిట్ చేస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ వరసగా ప్రాజెక్టులు కమిటవటంతో అతనికి టెన్షన్ పట్టుకుందని చెప్తున్నారు. సుకుమార్,త్రివిక్రమ్ ప్రాజెక్టులు నెక్ట్స్ ఉంటాయని అంటున్నారు. ఈ లోగా మరో దర్శకుడు ఎవరన్నా సూపర్ హిట్ అయితే క్రేజీ కాంబినేషన్ కోసం అతనితోనూ ముందుకువెళ్లే అవకాసం ఉంది. దాంతో తనకు ఎన్టీఆర్ సినిమా ఉందో లేక హ్యాండ్ ఇచ్చాడో అర్దం కాని సిట్యువేషన్ లో వక్కంతం వంశీ ఉన్నాడని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

    ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం.. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. 2013 వేసవికి 'బాద్‌షా'గా వచ్చారు. తర్వాత 'రామయ్యా వస్తావయ్యా' గా వచ్చి అలరించలేకపోయారు. ఇప్పుడు సంతోష్‌ శ్రీనివాస్‌తో ఓ చిత్రం సెట్స్‌ ఉంది. సుకుమార్‌ ప్రస్తుతం మహేష్‌బాబుతో '1' చిత్రం ఫైనల్ టచ్ స్ లో ఉన్నారు. ఇవి పూర్తయ్యాకే ఈ కొత్త కాంబినేషన్‌ సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయి. ఈ చిత్రం ఖచ్చితంగా కొత్త తరహాలో యూత్ ని ఆకట్టుకునేలా ఉంటుందని చెప్తున్నారు.

    'అత్తారింటికి దారేది' నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 2014 సమ్మర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి రిలియన్స్ వారు కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహిస్తారు. గత మూడు చిత్రాలుగా బి.వియస్ ఎన్ ప్రసాద్ అశోశియేషన్ లో ఉన్న రిలియన్స్ వారు..ఈ సినిమాతో మళ్లీ తమ అశోశియేషన్ ని ఎక్సటెండ్ చేసారు.

    English summary
    Vakkantam Vamsi who scripted stories for many blockbusters planned to direct a film and even NTR who love him gave green signal. Vamsi already prepared script for the film. However sources say NTR is having second thoughts on doing the film under new director. Sources say this is resulting in delay of the project. It has to be seen whether NTR will give a nod or not for this film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X