»   » బాహుబలి పార్ట్ 2లో ‘డబ్ల్యుడబ్ల్యుఇ’ స్టార్స్..?

బాహుబలి పార్ట్ 2లో ‘డబ్ల్యుడబ్ల్యుఇ’ స్టార్స్..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ వైడ్ ఈ చిత్రం దాదాపు 600 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాలం బాషల్లో రిలీజైన ఈచిత్రం ఒక్క ఇండియాలోనే 500 కోట్లకుపైగా వసూలు చేసి ఇండియన్ బాక్సాఫీసు వద్ద నెం.1 స్థానం సొంతం చేసుకుంది.

బాహుబలి పార్ట్ 1 ఎండింగులో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే? ప్రశ్న ఇపుడు భారతీయ సినీ ప్రేక్షకులను వేధిస్తోంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికి బాహుబలి పార్ట్ 2 కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలో కాలకేయుడి పాత్ర, ఆ పాత్ర కోసం సృష్టించిన కిలికి భాష ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సెకండాఫ్ లో అనుష్క గ్లామరస్ రోల్ కూడా ‘బాహుబలి-2'పై అంచనాలు మరింత పెరిగేలా చేసాయి.


WWE Stars In Baabubali-2

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి-2' మార్కెట్ పెంచేందుకు రాజమౌళి కొత్త ప్లాన్స్ వేస్తున్నారని, సినిమాలోకి వరల్డ్ ఫేమస్ డబ్ల్యు డబ్ల్యు ఇ స్పోర్ట్స్ స్టార్స్‌ను దించుతున్నట్లు తెలుస్తోంది. WWE ఛాపింయన్లయిన రెన్నా, బ్రూక్ లెస్సార్, సెయినా లాంటి వారితో సినిమాలో నటింపచేస్తున్నట్లు సమాచారం.


వచ్చే ఏడాది ‘బాహుబలి' సెకండ్ పార్ట్ విడుదల కాబోతోంది. ఇప్పటికే ‘బాహుబలి' ఫస్ట్ పార్ట్ చూసిన వారు రెండో భాగం ఎప్పుడు విడుదలవుతుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయింది. మిగిలిన 60 శాతం పూర్తి చేసి 2016లో సినిమాను విడుదల చేయనున్నారు.

English summary
WWE Stars In Baabubali-2. Some speculated on Rajamouli is roping in style worldwide sports individuals Renna, Brook Lessar and Seinna, who’re WWE champions.
Please Wait while comments are loading...