»   » 'దాసరి సినిమాకు పట్టిన దరిద్రం' అని తిట్టడానికి అస్సలు కారణం?

'దాసరి సినిమాకు పట్టిన దరిద్రం' అని తిట్టడానికి అస్సలు కారణం?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ నిర్మాత యలమంచిలి రవిచంద్ సినీ నిర్మాత దాసరి నారాయణరావును ఉద్దేశించి చేసిన కామెంట్ అంతటా పెద్ద చర్చగా మారింది. దాసరి నారాయణరావు సినిమాకు పట్టిన దరిద్రం అని ఆయన డైరక్ట్ గానే అన్నారు. అయితే దీనికి కారణం ఏమిటీ అని విచారిస్తే.. సినిమా కార్మికుల సమ్మె వెనుక దాసరి నారాయణరావు ఉన్నారని అనుమానం తోటే ఇలా అన్నారని తెలుస్తోంది. పైకి సినిమా పరిశ్రమకు ప్రయోజనం చేకూరేలా పనిచేస్తానని చెబుతూ దాసరి నారాయణరావు లోపల మాత్రం అన్ని సినీ వ్యతిరేక చర్యలు చేస్తున్నారన్నది ఆయన ఇలా కామెంట్ చేసారని సిని జనం అంటున్నారు. సిని కార్మికుల వేతనాలు పెంచుతామని ఒప్పుకున్నప్పటికీ వారు రకరకాల షరతులు పెడుతూ అనేక సమస్యలు సృష్టించారని ఇదంతా దాసరి వెనక నుంచి ఆడించిన డ్రామా అని కొందరు విమర్శిస్తున్నారు. అయితే ఈ వివాదంపై దాసరి నారాయణరావు చాలా జాగ్రత్తగా స్పందించారు. సినీ పరిశ్రమలో అబిప్రాయ బేధాలు ఉండవచ్చని, అంత మాత్రాన ఐక్యంగా లేనట్లుగాదని అన్నారు.

English summary
Strike which was called by AP Film Employees Federation is expected to be called off later today. Couple of days ago, the federation went on a strike demanding a raise in their wages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu