ఆశలు అవిరయ్యేలా ఉన్నాయి.. KGF 2 అభిమానులకు బ్యాడ్ న్యూస్?
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక్కసారిగా కన్నడ సినిమా స్థాయిని పెంచిన ఆ సినిమా బాషాభేదం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. పాన్ ఇండియా సినిమాలు తప్పకుండా వర్కౌట్ అవుతాయని రుజువు చేసింది. ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇంకా హై రేంజ్ లో KGF కలెక్షన్స్ పెరిగేవి.
అయితే సినిమా సెకండ్ పార్ట్ కోసం దేశ వ్యాప్తంగా ఈ సినిమా అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే పరిస్థితులను బట్టి సినిమా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవచ్చని తెలుస్తోంది. అసలైతే KGF ఛాప్టర్ 2 దసరా సందర్భంగా ఇదే సంవత్సరం రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ లాక్ డౌన్ కారణంగా షూటింగ్ పనులు ఆగిపోయాయి. మళ్ళీ కొత్త షెడ్యూల్ వేసుకొని సినిమాను స్టార్ట్ చేయాలి అంటే చాలా కష్టమైన పని.

అసలే యాక్షన్ సినిమా. సినిమా అనుకున్నట్లు వచ్చే వరకు కష్టపడాలి. మొత్తంగా KGF 2 అనుకున్న సమయానికి రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఇక ఈ ఇయర్ ఎండింగ్ లో గాని లేక వచ్చే సమ్మర్ లో గాని సినిమాను రిలీజ్ చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆలోచిస్తున్నాడట. ఇప్పటికే నెక్స్ట్ షెడ్యూల్స్ కోసం ఒక ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఇయర్ లోనే సినిమాను ఎలాగైనా రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తారట. ఇక కరోనా లాక్ డౌన్ ఇలాగే కొనసాగితే వచ్చే ఏడాదికే రావచ్చని సమాచారం.


Click it and Unblock the Notifications











