KGF 2 లేటెస్ట్ షూటింగ్ అప్డేట్.. టీజర్ డేట్ ఫిక్స్ చేసుకున్న డైరెక్టర్?

కన్నడ స్టార్ హీరో యష్ నటించిన KGF సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక సినిమాకు సంబంధించిన సెకండ్ చాప్టర్ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వైరస్ లాక్ డౌన్ లేకపోయి ఉంటే ఈపాటికే ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ పై ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేది. సినిమాను మొదట సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే.

తుది దశలో ఉన్న సినిమా షూటింగ్ కోసం ఇంకొన్ని రోజులు కష్టపడితే సరిపోతుందట. దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్నట్టుగానే సినిమా షెడ్యూల్ సాఫీగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక టీజర్ ని కూడా వీలైనంత త్వరగా రెడీ చేయాలని మరో కొత్త టార్గెట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కుదిరితే దసరా సందర్భంగా అక్టోబర్ 25న అన్ని భాషల్లో ఒకేసారి KGF 2 టీజర్ ని రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Yash pan india film Kgf 2 teaser release date fix

మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే షూటింగ్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే. వచ్చే నెల ఏండింగ్ లోపు ఎలాగైనా షూటింగ్ పనులను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులను స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. గతంలో సినిమాకు సంబంధించిన ఒక లిరికల్ సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తారని టాక్ అయితే వచ్చింది.

ఇక దానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు ఇస్తారో చూడాలి. మొత్తానికి పరిస్థితులు గనక అనుకూలించి థియేటర్స్ గనక యధావిధిగా నడిస్తే సంక్రాంతికి KGF 2ను రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X