నరాలు కట్ అయ్యే రూమర్.. అగ్ర దర్శకుడితో రామ్ చరణ్, యష్, ఇక ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వాల్సిందే!
బాహుబలి తరువాత సౌత్ ఇండియన్ స్టైల్ పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. ముఖ్యంగా మల్టీస్టారర్ సినిమాలు చాలానే తెరపైకి వస్తున్నాయి. RRR తరువాత అదే తరహాలో మరిన్నీ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కథలు తెరపైకి వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇక ఇటీవల ఒక అగ్ర దర్శకుడికి సంబంధించిన కొన్ని డ్రీమ్ ప్రాజెక్టులపై సోషల్ మీడియాలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ రత్తాలు లక్ష్మీ రాయ్ హాట్ బికినీ ఫొటోలు
Recommended Video

RRR కథ క్లైమాక్స్ కు వచ్చేసింది
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న చిత్రం RRR. ఈ సినిమా కోసం మెగా నందమూరి అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇప్పటికే సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు వచ్చేసింది. ఈ ఏడాది దసరా సమయానికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. RRR తరహాలోనే మరికొన్ని మల్టీస్టారర్ ప్రాజెక్టులు కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం.

మరోక బిగెస్ట్ మల్టీస్టారర్
సౌత్ ఇండస్ట్రీలో మరోక బిగెస్ట్ మల్టీస్టారర్ తెరకెక్కే అవకాశం ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. అది కూడా సౌత్ స్టార్ డైరక్టర్ శంకర్ తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు టాక్ వస్తోంది. ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ రూమర్ ఎప్పుడు ఎక్కడ మొదలైందో గాని సౌత్ ఇండస్ట్రీలో మాత్రం నెవర్ బిఫోర్ అనేలా వైరల్ అవుతోంది.

పవర్ స్టార్ తో చరణ్ అన్నారు..
లాక్ డౌన్ లోనే కొన్ని కథలను సెట్ చేసుకున్న డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ గా తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇక ఫైనల్ గా ఇప్పుడు ఒక స్టోరీ సెట్టయినట్లు తెలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. నిన్నటి వరకు సోషల్ మీడియాలో ఈ రూమర్ బాగా వైరల్ అయ్యింది. పవర్ స్టార్ కూడా స్క్రీమ్ షేర్ చేసుకునే అవకాశం ఉందని కూడా కథనాలు వచ్చాయి.

హిస్టారికల్ వార్ డ్రామా?
హిస్టారికల్ వార్ డ్రామాగా తెరకెక్కబోయే ఈ ప్రాజెక్ట్ లో రామ్ చరణ్ మెయిన్ లీడ్ లో కనిపిస్తాడట. ఇక ఇప్పుడు పవన్ కాకుండా కన్నడ హీరో యష్ నటించే అవకాశం ఉన్నట్లు మరొక కొత్త రూమర్ వైరల్ అవుతోంది. యష్ సెకండ్ హాఫ్ లో కీలకమైన పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక విధంగా రూమర్ నిజమైతే అభిమానులకు పండగే అనే చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











