Toxic: కన్నడ ఇండస్ట్రీలో యష్ సరికొత్త చరిత్ర.. టాక్సిక్‌ కోసం భారీ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లంటే?

2026లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్‌లో నిలిచిన చిత్రాల్లో కన్నడ సూపర్‌స్టార్ యష్ నటించిన టాక్సిక్ : ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ కూడా ఒకటి. కేజీఎఫ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకుని రాకింగ్ స్టార్ అనిపించుకున్నారు యష్. కేజీఎఫ్ తర్వాత ఆయన నటించిన సినిమా కావడంతో టాక్సిక్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 19వ తేదీన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీ వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం యష్ పారితోషికం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఈ వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్‌తో టాక్సిక్
టాక్సిక్ మూవీకి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ, యష్‌లు సంయుక్తంగా రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇందులో యష్ సరసన ఐదుగురు హీరోయిన్లు రుక్మిణీ వసంత్, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషీ, తారా సుతారియాలు నటిస్తున్నారు. ఇప్పటికే వీరి లుక్‌ని రివీల్ చేస్తూ విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది.

Yash Remuneration for Toxic Did KGF star Break Sandalwood s Highest Pay Record

టాక్సిక్‌ తారాగణం
ఇంకా ఈ చిత్రంలో అక్షయ్ ఒబెరాయ్. బియాట్రిజ్ తౌఫాన్‌బచ్‌, డెరిల్ డీ సిల్వ, సుదేవ్ నాయర్, అమిత్ తివారీ, టోవినో థామస్, కైల్ పాల్‌లు టాక్సిక్‌లో కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీత దర్శకత్వం వహిస్తుండగా... ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్, రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల యష్ పుట్టినరోజును పురస్కరించుకుని విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌ అంచనాలను పెంచేయడంతో పాటు వివాదాలను తీసుకొచ్చింది. ఈ గ్లింప్స్‌తో టాక్సిక్ సినిమా ఎలా ఉండబోతుందో? యష్ పాత్ర ఏంటో? హింట్ ఇచ్చారు గీతూ మోహన్‌దాస్. అయితే ఈ గ్లింప్స్‌లో మితిమీరిన యాక్షన్.. కారులో రొమాన్స్ సీన్ వివాదాస్పమై విషయం మహిళా కమీషన్ వరకు వెళ్లింది. దీనికి సీబీఎఫ్‌సీ క్లారిటీ ఇచ్చింది.

టాక్సిక్ వివాదాలు
అయితే రెండ్రోజుల క్రితం టాక్సిక్ గ్లింప్స్‌పై క్రైస్తవ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. స్మశాన వాటిక వద్ద చిత్రీకరించిన సన్నివేశంపై సీబీఎఫ్‌సీకి ఫిర్యాదు చేశాయి. కారులో ఇంటిమేట్ సీన్‌తోపాటు స్మశానం వద్ద హింస, కాల్పులు, పేలుళ్ల సీన్ ... తమ మనోభావాలు దెబ్బతీశాయని క్రైస్తవ సంఘాలు భగ్గుమంటున్నాయి. వెంటనే ఆ టీజర్‌ను సోషల్ మీడియా నుంచి, యూట్యూబ్ నుంచి తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

టాక్సిక్‌కు రికార్డ్ ప్రీ రిలీజ్ బిజినెస్
అటు ఎన్ని వివాదాలు చుట్టుముడుతున్నా గీతూ మోహన్‌దాస్ టాక్సిక్ షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. అటు ఈ సినిమాపై హైప్ నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఇటీవల టాక్సిక్ ఓవర్సీస్ రైట్స్‌ను 105 కోట్ల రూపాయలకు పార్స్ ఫిలింస్ దక్కించుకుంది. అలాగే తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను దిల్‌రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ రూ. 120 కోట్లకు కైవసం చేసుకున్నారు. మొత్తంగా థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌ కింద ఈ సినిమాకు 1000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.

యష్‌కి రికార్డ్ పారితోషికం
ఇదిలాఉండగా.. టాక్సిక్ కోసం యష్ పారితోషికం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ సినిమాకు గాను రాకింగ్ స్టార్ దాదాపు 50 కోట్ల నుంచి 75 కోట్ల రూపాయల రేంజ్‌లో పారితోషికం తీసుకున్నారని చెబుతున్నారు. ఇక నిర్మాత కావడంతో లాభాల్లో వాటా, డిస్ట్రిబ్యూషన్ షేర్ కింద యష్‌కి టాక్సిక్ ద్వారా 150 కోట్ల రూపాయల ఆదాయం లభించనుందని కన్నడ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా రిషబ్ శెట్టి నిలిచారు. కాంతార చాప్టర్ 1కు గాను ఆయన దాదాపు 80 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్నట్లు ఫిలింనగర్ టాక్. ఇప్పుడు ఈ రికార్డును టాక్సిక్‌తో యష్ బద్ధలు కొట్టినట్లయ్యింది. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: yash toxic nayanthara
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X