Yash vs Nani: నానితో యష్ పోటీ! బాక్సాఫీస్ వార్‌కు టాక్సిక్ రెడీ?

కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్'. కేజీఎఫ్ 2 తర్వాత యష్ నటిస్తున్న మరో భారీ బడ్డెట్ సినిమా కావడంతో ప్రారంభం నుంచే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ప్రముఖ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కించారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా పలుమార్లు వాయిదా పడటం, సరైన సమయానికి అధికారిక అప్డేట్స్ రాకపోవడం వల్ల సినిమాపై హైప్ తగ్గిందనే చెప్పాలి. ఈ క్రమంలో టాక్సిక్ రిలీజ్ కు మూవీమేకర్స్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.

టాక్సిక్ సినిమాలో యష్ సరసన కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్స్ కీలక పాత్రల్లో నటించారు రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమాను కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. మొదట ఈ సినిమాను మార్చి 19న విడుదల చేయాలని భావించారు. ఆ తర్వాత జూన్ 4 తేదీని ఖరారు చేసినప్పటికీ నిర్మాణ పనులు,పోస్ట్ ప్రొడక్షన్ కారణాలతో మళ్లీ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో యష్ కొన్ని సన్నివేశాలపై అసంతృప్తిగా ఉండి రీషూట్‌లు కోరారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

Yash vs Nani Toxic August Release Buzz Sparks Box Office Clash With The Paradise

దాదాపు రూ.40 కోట్ల వ్యయంతో తెరకెక్కించిన సినిమాలోకి కీలక సన్నివేశాలను రీషూట్ చేశారనే వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ప్రచారాన్ని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఖండించింది. 'టాక్సిక్'కు ఎలాంటి రీషూట్‌లు ప్లాన్ చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో అభిమానులు ఊహాగానాలకు చెక్ పడినట్టైంది.ఇక తాజాగా ఇండస్ట్రీ టాక్ ప్రకారం టాక్సిక్ ను ఆగస్టు నెల చివరిలో విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై జూన్ 21న మేకర్స్ కీలక అప్డేట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుండటంతో 'టాక్సిక్'మళ్లీ చర్చనీయాంశమైంది.

ఇదే జరిగితే బాక్సాఫీస్ వద్ద భారీ క్లాస్ జరిగే అవకాశముంది. ఎందుకంటే? నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'ది ప్యారడైజ్' ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది. 'దసరా' తర్వాత వస్తున్న ఈ కాంబినేషన్ కావడంతో సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ అంచనాలను మరింత పెంచాయి. కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం సమాచారం ప్రకారం 'ది ప్యారడైజ్' ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇదే సమయంలో 'టాక్సిక్' కూడా ఆగస్టులో విడుదలైతే సౌత్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనే అవకాశముంది. ఒకవైపు కేజీఎఫ్,కేజీఎఫ్ 2 వంటి విజయాలతో యష్, వరుస విజయాలతో దూసుకెళ్తున్న నాని మధ్య జరిగే ఈ పోటీపై సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే టాక్సిక్ విడుదల తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మేకర్స్ ప్రకటించే డేట్‌ను బట్టి ది ప్యారడైజ్ తో క్లాష్ ఉంటుందా? లేక వేరే తేదీని ఎంచుకుంటారా? అన్నది తేలనుంది.

Read more about: yash kiara advani nani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X