వైఎస్ఆర్ బయోపిక్: వైఎస్ జగన్ పాత్రలో రూ. 100 కోట్ల సంచలన స్టార్?

Recommended Video

YSR Biopic : Vijay Devarakonda As YS Jagan...?

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ 'యాత్ర' విషయంలో చాలా రోజులుగా అంశం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ఆర్ తనయుడు, వైసీపీ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటించబోతున్నారు? ఆయన పాత్ర ఈ చిత్రంలో ఏ విధంగా చూపించబోతున్నారు? అనేది హాట్ టాపిక్ అయింది.

గతంలో ఈ పాత్రకు సూర్య, కార్తి పేర్లు వినిపించాయి. తాజాగా మరో హీరో పేరు తెరపైకి వచ్చింది. అతి తక్కువ సమయంలో టాలీవుడ్లో సంచలన స్టార్‌గా ఎదిగిన విజయ్ దేవరకొండ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన 'గీత గోవిందం' సినిమాతో రూ. 100 కోట్ల వసూళ్లు చేసే సత్తా ఉన్న స్లార్ల జాబితాలో చేరిన విజయ్... త్వరలో వైఎస్ జగన్ పాత్రలో తెరపై మెరవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

విజయ్ దేవరకొండపై కన్నేసిన డైరెక్టర్

విజయ్ దేవరకొండపై కన్నేసిన డైరెక్టర్

విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ వైఎస్ జగన్ పాత్రకు పర్ఫెక్టుగా సూటవుతుందని దర్శకుడు మహి.వి రాఘవ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా ఎలాంటి అఫీషియల్ సమాచారం వెలువడలేదు. మరి ప్రచారంలో నిజం ఎంత? అనేది చిత్ర యూనిట్ వివరణ ఇవ్వాల్సి ఉంది.

యాత్ర

యాత్ర

‘యాత్ర' సినిమా విశేషాల్లోకి వెళితే... రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ప్రమోషనల్ సాంగ్స్‌కు మంచి స్పందన వచ్చింది. మమ్ముట్టిని చూస్తుంటే అచ్చ వైఎస్ఆర్‌ను చూసినట్లే ఉందని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.

 రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర

రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర

వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 60 రొజుల్లో 1500 కిలోమీట‌ర్ల పాదయాత్ర చేశారు. ఈ పాద్రయాతను ప్రధానంగా ఫోకస్ చేస్తూ 'యాత్ర' సినిమా ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజల కోసం చేసిన మంచి పనులు, సంక్షేమ పథకాలు సినిమాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

 విడుదల తేదీ

విడుదల తేదీ

వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 21 న యాత్ర చిత్రం విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అనసూయ, పోసాని కృష్ణ మురళి, వినోద్ కుమార్, సచిన్ ఖేడేకర్, సుహాసిని మణిరత్నం తదతరులు నటిస్తున్నారు. 70ఎంఎం పిక్చర్స్ పతాకంపై విజయ్ చిల్ల, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X