అక్కినేని ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ .. సమంత- నాగచైతన్య మళ్లీ కలుస్తారా?
అక్కినేని నాగార్జున - అమల దంపతుల కుమారుడు అఖిల్ వివాహం జైనాబ్ రవ్జీతో ఘనంగా జరిగింది. వీరి పెళ్లితో అక్కినేని ఫ్యామిలీతో సంబరాలు మిన్నంటాయి. కుటుంబం మొత్తం ఒకేచోట చేరి సందడి చేశారు. ఇప్పటికే నాగచైతన్య - శోభితల వివాహం జరగ్గా.. కొద్దినెలలకే అఖిల్- జైనాల్‌ల పెళ్లి కూడా జరగడంతో నాగార్జున సంతోషంగా ఉన్నారు. త్వరలోనే ఆయన నటించిన కుబేర చిత్రం ప్రేక్షకులకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో అక్కినేని అభిమానులు పండగ చేసుకునే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏమాయ చేశావేతో ప్రేమలో పడ్డ చైతూ- సమంత
నాగచైతన్య - సమంతలు మరోసారి కలవబోతున్నారన్నదే ఆ వార్త. ఏమాయ చేశావే సినిమాలో కలిసి నటించిన వీరిద్దరూ ఈ సమయంలోనే ప్రేమలో పడి కొన్నేళ్లపాటు డేటింగ్ చేశారు. వీరి ప్రేమపై మీడియాలో గాసిప్స్ వచ్చినప్పటికీ ఇద్దరూ ఖండించలేదు. 2017లో ఆ ఊహాగానాలను నిజం చేస్తూ సమంత- నాగచైతన్యలు గోవాలో ఒక్కటయ్యారు. టాలీవుడ్‌లోనే స్టార్ కపుల్‌గా ఈ జంట అన్యోన్యంగా మెలిగింది. పెళ్లయినా సమంత సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. నాగచైతన్య ఎక్కడ కనిపించినా సమంత ఖచ్చితంగా వెంటే ఉండేది.

నాలుగేళ్లకే విడాకులు
రేపో మాపో గుడ్‌న్యూస్ చెబుతారని అక్కినేని కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో అక్కినేని ఇంటి పేరుని తొలగించారు సమంత. ఆ తర్వాత కొద్దిరోజులకు నాగచైతన్య ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు, గొడవలు చోటు చేసుకున్నాయంటూ మీడియాలో రకరకాల గాసిప్స్ వచ్చేవి. వాటిని నిజం చేస్తూ సమంత- నాగచైతన్యలు ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేయడంతో అక్కినేని అభిమానులు ఉలిక్కిపడ్డారు. 2021లో న్యాయస్థానం వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది.
ఎవరి జీవితం వాళ్లదే
నాటి నుంచి ఎవరి దారులు వారు చూసుకున్నారు. నాగచైతన్య కొన్నేళ్ల తర్వాత హీరోయిన్ శోభిత ధూళపాళతో ప్రేమలో పడి గతేడాది ఆమెను పెళ్లి చేసుకున్నారు. సమంత కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేయడంతో పాటు నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తోంది. బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. తమ మధ్య ఏం లేదని వీరిద్దరూ ఖండిస్తూనే వస్తున్నా.. పుకార్లకు మాత్రం చెక్ పడటం లేదు.
ఏమాయ చేశావో రీ రిలీజ్
విడాకులు తీసుకుని విడిపోయిన నాలుగేళ్ల తర్వాత సమంత- నాగచైతన్య కలవబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి ప్రేమకు, పెళ్లికి దారి తీసిన ఏమాయ చేశావే చిత్రం 15 ఏళ్లు పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో జూలై 18న ఈ రొమాంటిక్ మూవీ రీ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్‌లో హీరో హీరోయిన్లు తమ సినిమాలకు పబ్లిసిటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చైతూ- సమంతలు కూడా ఈ సినిమా ప్రమోషన్‌లో పాల్గోంటారని మీడియాలో గాసిప్స్ వస్తున్నాయి. అయితే రియాలిటీలో అది కష్టమేనని అంటున్నారు విశ్లేషకులు. చైతూ గుర్తులను ఒక్కొక్కటిగా చెరిపేస్తోన్న సమంత.. తన మాజీ భర్తను కలిసేందుకు ఇష్టపడతారా? అన్నది అనుమానమే. అటు చైతన్య కూడా సమంత విషయంలో మెత్తబడినట్లుగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్ధితుల్లో ఈ మాజీ భార్యాభర్తలు ఒకే వేదికపై కనిపించడం దాదాపు అసాధ్యమేనని అంటున్నారు విశ్లేషకులు.


Click it and Unblock the Notifications











