నెట్ లో రామ్ చరణ్ 'ఎవడు' డైలాగు రచ్చ
రామ్ చరణ్ తేజ,వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ఎవడు. ఈ చిత్రంలో డైలాగు అంటూ ఒకటి ఇప్పుడు నెట్ లోకంలో పాపులర్ అవుతోంది. అదేమిటంటే..."నా దగ్గర ఏముందో నాకు తేలుసు...నేను అదే చెప్తున్నా...నీ దగ్గర లేనిది ఉందంటే మాత్రం ..ఇంకేమీ చెప్పను...గుడ్డలు ఊడదీస్తా..". ఈ డైలాగుని విలన్ తో హీరో అంటాడని చెప్తున్నారు. ఇక ఈ డైలాగు ని రామ్ చరణ్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గత కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా షూటింగ్ మెగా స్టార్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఈ చిత్రంలో సమంతను లీడ్ హీరోయిన్ గా ఎంపిక చేశారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో సమంతతో పాటు సెకండ్ హీరోయిన్‌గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్‌ను కూడా ఎంపిక చేశారు. 'మద్రాసు పట్టణం' అనే సినిమా ద్వారా భారతీయ సినీ పరిశ్రమకు పరిచయమైన ఈ బ్రిటిష్ మోడల్, ఆతర్వాత 'ఏక్ దివానాథా' అనే హిందీ చిత్రంతో పాటు, తాండవం అనే తమిళ చిత్రంలో కూడా అవకాశం దక్కించుంది. రామ్ చరణ్ 'ఎవడు' సినిమా ఆమెకు తొలి తెలుగు సినిమా కాబోతోంది.


Click it and Unblock the Notifications











