చెర్రీ ‘ఎవడు’ మహేష్ నుంచి ఇన్‌స్పైర్డ్?
పోకిరి సినిమాలో మహేష్ బాబు అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా నటించి అదరగొట్టిన విషయం తెలిసిందే. మహేష్ బాబు దెబ్బకు తెలుగు సినిమా రికార్డులన్నీ బద్దలయ్యాయి. దూకుడు సినిమాలో కూడా మహేష్ పోషించిన పోలీస్ పాత్రకి కలెక్షన్లు భారీగానే రాలాయి. ఈ నేపథ్యంలో మరికొందరు టాలీవుడ్ హీరోలు కూడా మహేష్ బాబు బాటలో పోలీసు పాత్రలు వేసి నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నారట. జూనియర్ ఎన్టీఆర్ బోయపాటి దమ్ము చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషిస్తున్నట్లు మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది.
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ విషయంలో కూడా సేమ్ పుకార్లు వినిపిస్తున్నాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'ఎవడు' సినిమాలో రామ్ చరణ్ అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడని, మహేష్ బాబు చేసిన పోలీస్ పాత్రలను ఇన్‌స్పైర్ చేసుకుని ఈ పాత్రను డిజైన్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో మరికొన్ని రోజుల్లో బట్టబయలు కానుంది. అంత వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











