ఎన్టీఆర్ బయోపిక్‌లో తారక్.. ఏ పాత్రలోనంటే..అందుకే సక్సెస్ మీట్‌కు బాలయ్య!

Recommended Video

Young Tiger NTR As Balakrishna In NTR Biopic ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. టెంపర్ నుంచి మొదలైన విజయ ప్రస్థానం అరవింద సమేత వరుకు అడ్డు, అదుపులేకుండా సాగుతున్నది. దసరా కానుకగా విడుదలైన అరవింద సమేత ఎన్టీఆర్ కెరీర్‌లోనే అరుదైన రికార్డులను నమోదు చేస్తున్నది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 21న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సక్సెస్ మీట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా రావడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. బాలయ్య సక్సెస్ మీట్‌కు రావడం వెనుక ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

ఎన్టీఆర్‌గా బాలకృష్ణ

ఎన్టీఆర్‌గా బాలకృష్ణ

ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్నది. తొలి భాగాన్ని కథా నాయకుడిగా, రెండో భాగాన్ని మహానాయకుడిగా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బాలకృష్ణ పాత్ర కూడా అత్యంత ప్రాధాన్యమైన విషయం తెలిసిందే.

బాలకృష్ణగా ఎన్టీఆర్

బాలకృష్ణగా ఎన్టీఆర్

అయితే బాలకృష్ణ పాత్రలో తొలుత ఆయన కుమారుడు మోక్షజ్జ నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం బాబాయ్ బాలయ్య పాత్రలో ఎన్టీఆర్ నటించనున్నారట. త్వరలోనే ఎన్టీఆర్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.

ఎన్టీఆర్‌ను ఒప్పించిన బాలయ్య

ఎన్టీఆర్‌ను ఒప్పించిన బాలయ్య

హరికృష్ణ మరణానికి ముందు బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబాల మధ్య సంబంధాలు అంతంతా మాత్రమే అని చెప్పుకొంటారు. ఇటీవల కాలంలో వారి కుటుంబాల మధ్య రిలేషన్ మెరుగుపడ్డాయని సమాచారం. ఆ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బయోపిక్‌లో బాలయ్య పాత్రకు ఎన్టీఆర్‌ను ఒప్పించినట్టు తెలిసింది. ఆదివారం జరిగే అరవింద సమేత సక్సెస్ మీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించే అవకాశం లేకపోలేదు.

హరికృష్ణగా కల్యాణ్ రామ్

హరికృష్ణగా కల్యాణ్ రామ్

ఇప్పటికే హరికృష్ణ పాత్రలో ఆయన కుమారుడు కల్యాణ్ రామ్ నటిస్తున్నారు. చైతన్య రథసారధి పాత్రలో కల్యాణ్ రామ్ కనిపించబోతున్నాడు. ఒకవేళ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాకు తోడైతే నందమూరి అభిమానులకు పండుగే. బాలకృష్ణ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తే ఈ సినిమాపై భారీ అంచనాలు పెరుగడం ఖాయం.

శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్

శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్

ఎన్టీఆర్ బయోపిక్‌లో భారీ సంఖ్యలో స్టార్ నటీనటులు నటిస్తున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ, బసవతారకం పాత్రలో విద్యాబాలన్ కనిపిస్తారు. అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, చంద్రబాబుగా రానా, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, జయప్రదగా రాశీఖన్నా తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X