For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Unstoppable With NBK: లక్కీ ఛాన్స్ కొట్టేసిన యువ దర్శకుడు.. బాలయ్యతో భయపెట్టే మూవీ?

    |

    నందమూరి బాలకృష్ణ మొదటిసారి అన్ స్టాపబుల్ అనే టాక్ షో తో మంచి క్రేజ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో మొదలు కాబోయే ఈ టాక్ షో రెండవ సీజన్ కోసం ఓ వర్గం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే మరోవైపు నందమూరి బాలకృష్ణ మరో రెండు సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 17వ సినిమా షూటింగ్ ను బాలయ్య పూర్తి చేస్తున్నాడు. అలాగే అనిల్ రావుపూడి దర్శకత్వంలో కూడా మరొక మాస్ కమర్షియల్ సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

    ఈ రెండు ప్రాజెక్టులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని బాలకృష్ణ ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. అయితే మరో ప్రాజెక్టు కూడా చర్చలలోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఒక యువ దర్శకుడు చెప్పిన థ్రిల్లింగ్ కథ బాగా నచ్చడంతో మరికొంత డెవలప్ కూడా చేయాలని బాలయ్య బాబు సూచనలు ఇచ్చారట. అతనితో ఇదివరకే బాలయ్య బాబు అన్ స్టాపబుల్ ప్రోమో కూడా చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

    Young director prashanth varma another lucky chance to nandamuri balakrishna

    ఇటీవల విడుదలైన ప్రోమో ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అ! సినిమాతో దర్శకుడిగా పరిచయమైన యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ ప్రోమోలను డిజైన్ చేశాడు. అతను కల్కి అలాగే జాంబిరెడ్డి సినిమాలతో కూడా దర్శకుడిగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ప్రస్తుతం తేజ సజ్జా తోనే హనుమాన్ అనే ఫ్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక ఇటీవల అన్ స్టాపబుల్ ప్రోమోలను డైరెక్ట్ చేసిన ప్రశాంత్ వర్మ బాలయ్య బాబుతో ఏర్పడిన పరిచయంతో తన దగ్గర ఉన్న కథలను కొన్ని చెప్పాడట.

    ఇక అందులో థ్రిల్లింగ్ గా అనిపించే ఒక కాన్సెప్ట్ బాలయ్యకు బాగా నచ్చిందట. అందులో ఆడియన్స్ భయపెట్టే సన్నివేశాలు కూడా హైలెట్ అవుతాయట. ఇంతవరకు నందమూరి బాలకృష్ణ అలాంటి జానర్ లో సినిమాలు చేయలేదు. అయితే సినిమా కథ నచ్చడంతో బాలయ్య మరికొంత డెవలప్ చేయాలని కూడా దర్శకుడికి సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆ ప్రాజెక్టు ఓకే అయితే డివివి.దానయ్య నిర్మించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

    English summary
    Young director prashanth varma another lucky chance to nandamuri balakrishna
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X