నాగచైతన్య అన్నయ్య గా ఏ హీరో చేస్తున్నాడు?
నాగచైతన్య , అజయ్ భుయాన్ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో హీరో అన్నయ్య పాత్ర కీ రోల్ ప్లే చేయనుంది. ఈ పాత్రకు జగపతిబాబుని సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరీ ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటుందని మరో ఆప్షన్ గా వేరే యంగ్ హీరోని అడుగుతున్నారట. ఈ మధ్య పెద్దగా హిట్టులు లేని ఆ హీరో ఒప్పుకుంటే అటు షిప్ట్ అవుతారని చెప్తున్నారు. కథ ప్రకారం ఇండియాలో కాజల్ తో ప్రేమలో పడ్డ నాగచైతన్య అనుకోని పరిస్దితుల్లో బ్యాంకాక్ లో అన్నయ్య దగ్గరికి వెళ్ళతాడని అక్కడనుండి కథ మలుపు తిరుగుతుందని అంటున్నారు. ప్రకాష్ రాజ్ విలన్ గా చేసే ఈ చిత్రంలో అన్నయ్య పాత్రపై క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుందని అదే హైలెట్ అవుతుందని,అందుకే ఆ పాత్రకు చాలా జాగ్రత్తగా ఎంపిక చేయాల్సివస్తోందని చెప్పుకుంటున్నారు.
ఇక బ్యాంకాక్ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ చిత్రం జూన్ ఇరవై ఒకటవ తేది నుంచి బ్యాంకాక్ లో జరగనుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ మెయిన్ విలన్ గా చేయనున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రానికి కెమెరాని జ్ఞాన శేఖర్(వేదం ఫేమ్) అందించనున్నారు. బొమ్మరిల్లు చిత్రానికి మాటలు రాసిన అబ్బూరి రవి ఈ చిత్రానికి డైలాగులు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం కథ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని, ఊహించని ట్విస్ట్ లు, గోవాలో కేసినోలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ అంటున్నారు. ఇక అజయ్ భుయాన్ రూపొందించిన హౌస్ ఫుల్ చిత్రం ఎవరూ కొనక ఇంకా రిలీజ్ కు నోచుకోలేదు. అలాగే ఈ చిత్రాన్ని శివప్రసాద్ రెడ్డి తమ కామాక్షి మూవీస్ ఎంటర్టైనర్ పతాకంపై రూపొందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











