హీరోయిన్ల గ్లామర్ తోనే ఆ హీరోగారి సినిమాలు సక్సెస్..!?
అక్కినేని నాగచైతన్య హీరోగా హిట్లయితే వచ్చాయి కానీ ఇంతదాకా హీరో అనే గుర్తింపు మాత్రం దక్కలేదు. నాగచైతన్యని హీరో మెటీరియల్ గా గుర్తించే సినిమా ఇంతదాకా రాలేదు. కేవలం కథ, దర్శకుడు మాత్రమే హైలైట్ అయి హీరోకి ఎలాంటి గుర్తింపు రాకపోయినా పర్లేదు కానీ చైతన్య సినిమాల్లో అతను సైడ్ లైట్ అయి హీరోయిన్లు హైలైట్ అవుతున్నారు. ఏమాయ చేసావె, 100% లవ్ చిత్రాల్లో సమంత, తమన్నాలకి ఎక్కువ పేరొచ్చింది.
మరో వైపు చైతన్యకి నటన రాదని, డాన్స్ రాదని కామెంట్స్ పడుతున్నాయి. ఓ పెద్ద కుటుంబానికి చెందిన హీరోకి ఇలాంటి ఫీడ్ బ్యాక్ ఏమంత క్షేమకరం కాదు. ఇకనైనా హీరోయిన్లపైనా, దర్శకుల ప్రతిభపైనా ఆధారపడి బండి నెట్టాలని చూడకుండా నాగచైతన్య హీరోగా నిరూపించుకుంటే మంచిది. లేదంటే హీరో అయి పాతికేళ్లు దాటినా ఇంతదాకా ఇరవై కోట్ల మార్కెట్ లేని హీరోగా మిగిలిన నాగార్జునలానే ఉండిపోవాల్సి వస్తుంది.
naga chaitanya tamanna 100% love samantha ye maya chesave నాగచైతన్య తమన్నా 100% లవ్ సమంత ఏ మాయ చేసావె


Click it and Unblock the Notifications