Bhola Shankar: చిరంజీవి సినిమాలో యంగ్ హీరో.. ఏకంగా ఆ పాత్రలోనే!

రాజకీయాల కోసం యాక్టింగ్ కెరీర్‌కు గ్యాప్ ఇచ్చి.. సుదీర్ఘ విరామం తర్వాత 'ఖైదీ నెంబర్ 150'తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు టాలీవుడ్ బడా హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో.. అప్పటి నుంచి ఆయన మరింత ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పటికే పలు చిత్రాలను ప్రేక్షకులకు అందించి మెప్పించారు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' అనే చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. దీనికి భారీ స్పందన దక్కడంతో కలెక్షన్లు పోటెత్తాయి. దీంతో ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే మరికొన్ని చిత్రాలను కూడా లైన్‌లో పెట్టుకున్న విషయం తెలిసిందే. అందులో తమిళ మూవీ వేదాళంకు రీమేక్‌గా తెరకెక్కుతోన్న 'భోళా శంకర్' ఒకటి. దీన్ని టాలీవుడ్‌లో ఫ్లాప్ డైరెక్టర్‌గా పేరున్న మెహర్ రమేశ్ తీస్తుండడంతో ఆరంభంలోనే అందరి దృష్టిలో పడింది. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఇక, ఈ మూవీ షూటింగ్ గత ఏడాదే ప్రారంభం అయింది. అప్పటి నుంచి దీన్ని శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. ఇందులో భాగంగానే కొన్ని షెడ్యూళ్లను కూడా కంప్లీట్ చేశారు. ఇటీవలే ఓ భారీ కాస్టింగ్‌తో సాగే సాంగ్‌ను కూడా పూర్తి చేసుకున్నారు.

Young Hero Key Role in Chiranjeevi Bhola Shankar Movie

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటిస్తోన్న సంగతి విధితమే. ఇందులో ఆమెకు జోడీగా నటించాల్సిన ఓ యంగ్ హీరో పాత్ర కూడా ఉంది. దీనికి ఎవరిని తీసుకోవాలన్న దానిపై చిత్ర యూనిట్ తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ పాత్రను నితిన్ కానీ, నాగశౌర్య కానీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, దీనిపై క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా చిరంజీవి టాలీవుడ్‌లోని ఓ యంగ్ హీరో పేరును దర్శకుడు మెహర్ రమేష్‌కు సూచించినట్లు తెలిసింది. అయితే, ఆ హీరో ఎవరు అనేది మాత్రం ఇంకా బయటకు రాలేదు.

క్రేజీ కాంబోలో రాబోతున్న 'భోళా శంకర్' మూవీలో చిరంజీవికి జోడీగా తమన్నా భాటియా చేస్తోంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలను చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X