Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
హిట్టిచ్చిన మరో దర్శకుడితో చేతులు కలిపిన నిఖిల్.. ఆ సినిమాకు సీక్వెల్?
టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న యువ దర్శకులను ఎక్కువగా గుర్తించేది చిన్న హీరోలే. నిజాయితీగా ఉండి కథతో మెప్పిస్తే చాలు ఈజీగా సినిమా అవకాశాన్ని ఇస్తారు. ఇక యంగ్ టాలెంట్ దర్శకులతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడే వారిలో నిఖిల్ సిద్దార్థ్ ఒకడు. నిఖిల్ కెరీర్ మొదటి నుంచి కూడా మంచి గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నాడు. అందులో దర్శకులే ఎక్కువగా ఉన్నారు.
నెక్స్ట్ చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమాతో రాబోతున్న నిఖిల్ ఆ తరువాత మరో హిట్టు సినిమాకు కూడా సీక్వెల్ రెడీ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. నిఖిల్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో స్వామిరారా ఒకటి. నిఖిల్ స్నేహితుడు సుధీర్ వర్మ ఆ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా అందరికి మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే గత కొంత కాలంగా నిఖిల్ ఆ దర్శకుడితోనే మళ్ళీ డిఫరెంట్ సినిమా చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు.
లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం నిఖిల్ స్వామి రారా సీక్వెల్ కి కథను రెడీ చెయిస్తున్నట్లు టాక్ వస్తోంది. కార్తికేయ 2 తరువాత స్వామిరారా సీక్వెల్ ని సెట్స్ పైకి తీసుకొచ్చే అవకాశం సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక సుకుమార్ ప్రొడక్షన్ లో కూడా నిఖిల్ 18 పేజెస్ అనే మరో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.