శ్వేతాబసు వెనక ఆ హీరో?
కొత్త బంగారు లోకం సినిమాతో పరిచయమైన శ్వేతా బసు వెనక రెండు చిత్రాల హీరో తనీష్ పడుతున్నాడని గుసగుసలు వినపడుతున్నాయి. రైడ్ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. అక్కడ ఆమె అందచందాలు చూసి మతిపోగొట్టుకున్న తనీష్ షూటింగ్ పూర్తయినా ఆ పరిచయాన్ని కొనసాగిస్తున్నాడని తెలుస్తోంది. ఆమెను పబ్ కి ఆహ్వానించాడని, అయితే ఆమె రాకపోతే అలిగాడని, అలాగే ఆమెకు ప్రతీ రెండు గంటలకూ ఫోన్స్ చేస్తున్నాడని, ఎస్.ఎమ్.ఎస్ లకు అయితే కొదవలేదని అంటున్నారు. అయితే శ్వేతా కాస్త ముదురు అని ఇలాంటివి కాదనకుండా అవుననకుండా నెట్టుకొస్తోందని యూనిట్ సభ్యుల ద్వారా బయిటకు వచ్చింది.
ఇక రైడ్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఆ సినిమా ఇచ్చిన ఈ పరిచయాన్ని తనీష్ మర్చిపోలేకపోతున్నాడంటున్నారు. ఇక శ్వేత వర్గీయులు కాస్త చికాకుగానే సాటి నటుడు కదా అని కాస్త చనువు గా పలకరిస్తే అతను అంత సాగా సాగతీస్తున్నాడని విసుక్కుంటున్నారు. ఆమెకు తెలుగు ఫీల్డ్ లో అధ్బుతమైన భవిష్యత్ ఉందని, ఆమె చేజేతులా నాశనం చేసుకునే స్ధితిలో లేదని, ఎవరి హద్దుల్లో వారుంటే మంచిదని కామెంట్స్ చేస్తున్నారు. తెరపై ఉన్నట్లు తెరవెనక కుదరవని, ఆమె ఫ్యామిలీ కూడా ఈ విషయాలను గమనిస్తోందని మితిమీరితే తోక కత్తిరిస్తారని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











