పెళ్లి చేసుకోబోతున్న నివేదా థామస్.. ఒక్క పోస్టుతో కిరాక్ రేపిన నానీ హీరోయిన్!
ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్నటువంటి పలు యంగ్ హీరోయిన్స్ చాలా మందికి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. అలా ఆయా హీరోయిన్స్ కుర్రకారుకి బాగా దగ్గరయ్యి తమ సినిమాలతో అలరిస్తూ వచ్చారు. కొందరు తమ గ్లామ్ షో తో దగ్గరైన వాళ్ళు ఉన్నారు మరికొందరు అలాంటి స్కిన్ షో ఏమి చేయకుండా దగ్గరైన వారు కూడా చాలా మందే ఉన్నారు.
మరి ఇప్పుడు ఈ రెండో కోవకి చెందిన ఓ యంగ్ హీరోయిన్ ఫ్యాన్స్ లో బాంబు పేల్చింది. ఇన్ని రోజులు సింగిల్ అనుకున్న ఈమె తన రిలేషన్ షిప్ స్టేటస్ అన్నట్టుగా పెట్టిన తాజా పోస్ట్ వైరల్ గా మారింది. కాగా ఆ హీరోయిన్ మరెవరో కూడా టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో "జై లవకుశ", పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో "వకీల్ సాబ్", నాచురల్ స్టార్ నాని తో "జెంటిల్మెన్", "నిన్ను కోరి" లాంటి స్టార్స్ సినిమాల్లో కనిపించిన నటి నివేతా థామస్.

టాలీవుడ్ లో వరుసగా నాచురల్ స్టార్ తో సినిమాలు చేసి మంచి ఫేమ్ అందుకున్న ఈమె తర్వాత బిగ్ స్టార్స్ సినిమాల్లో కూడా నటించేందుకు ఎంతో సమయం కూడా తీసుకోలేదు. అయితే నివేత ఒక పెర్ఫామర్ ఎలాంటి స్కిన్ షో లేకుండా ఇవన్నీ అందుకుంది. అలా ఈ టాలీవుడ్ లో ఒక టైం వరకు బాగానే బిజీగా మారింది కానీ ఇప్పుడు కొంచెం స్లో అయ్యింది.
అయినా కూడా యూత్ లో ఆమె ఫాలోయింగ్ ఏమో తగ్గలేదు. కానీ ఇప్పుడు సడెన్ గా పెట్టిన ఓ పోస్ట్ మాత్రం తన ఫ్యాన్స్ గుండెలని కలుక్కుమనిపించింది. "ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది.. మొత్తానికి" అంటూ ఒక లవ్ సింబల్ ని పెట్టింది. దీనితో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మొత్తానికి నివేత థామస్ తన ప్రేమ విషయాన్ని బయటకి పెట్టింది అని కొందరు అంటుంటే మరికొందరు అసలు నివేత ప్రేమలో ఉందనే విషయాన్ని కూడా తెలీదు అంటున్నారు.

ఇక మరికొందరు ఫన్ రిప్లైలు ఇస్తుండగా ఇంకొందరు ఆమె పెళ్లి చేసుకోబోతుంది అని కొత్త జీవితానికి బెస్టాఫ్ లక్ చెబుతున్నారు. అయితే ఇలాంటి పోస్ట్ లు మన టాలీవుడ్ లో ప్రమోషనల్ గా కొత్తేమి కాదు. దీనితో అయితే ఇదేమన్నా కొత్త సినిమా కోసం కూడా కావచ్చని కూడా అనుకోవాలి. మరి దీనిపై మాత్రం నివేత సైడ్ నుంచి ఇంకొంచెం క్లారిటీ వస్తే ఈ కన్ఫ్యూజన్ కూడా తొలగిపోతుంది.
కాగా నివేత చివరి సారిగా టాలీవుడ్ లో 2022 లో వచ్చిన "శాకినీ డాకిని" లో కనిపించింది. ఆ తర్వాత తెలుగు సినిమాల్లో కనపడలేదు. ఇంకా ఈమె తమిళ్ లో సూపర్ స్టార్ రజినికాంత్ తో తన కూతురిగా "దర్బార్" అనే సినిమాలో కూడా నటించింది. దీనిని ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











