ప్రభాస్ లేటెస్ట్ అప్‌డేట్.. తదుపరి సినిమాలో ఇంట్రెస్టింగ్ రోల్!

బాహుబలి సినిమాతో భారీ పాపులారిటీ తెచ్చుకున్న ప్రభాస్.. ఆ తర్వాత సాహో సినిమా ద్వారా ఆశించిన ఫలితం రాబట్టలేక పోయాడు. దీంతో కాస్త నిరాశ చెందిన యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా జాన్‌పై దృష్టి సారించారు. ఈ సినిమాతో ప్రభాస్ మరో సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి వస్తున్న ఆసక్తికర అప్‌డేట్స్ రెబల్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపుతున్నాయి. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తన తాజా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది.

Young Rebal Star Prabhas Role In Next Project..

యూవీ క్రియేషన్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సాహో సినిమాకి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేసిన గిభ్రాన్ సంగీతం సమకూర్చుతున్నారు. కాగా తాజాగా అందిన సమాచారం మేరకు ఈ చిత్రంలో ప్రభాస్ పెర్ఫ్యూమ్ మేకర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే మన్మథుడు 2 సినిమాలో ఇలాంటి పాత్రనే చేశాడు కాబట్టి హీరో క్యారెక్టరైజేషన్‌లో కొన్ని మార్పులు చేస్తున్నారనేది తాజా సమాచారం. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X