NTR: పిల్లల విషయంలో ఎన్టీఆర్​ షాకింగ్ నిర్ణయం.. వాళ్ల కోసం ఇప్పటినుంచే అలా చేస్తూ..

ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. ఇక ఆయన నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఎన్టీఆర్ కు సంబంధించిన ఏ వార్త అయినా.. వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఎన్టీఆర్ తన పిల్లల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే....

సెలబ్రెటీస్ అంటేనే క్రేజ్: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రపంచవ్యాప్త సెలబ్రేటీ అయ్యారు. ఇక ఆయన సోషల్ మీడియాలో చాలా తక్కువగా యాక్టివ్ గా ఉంటారు. ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం దూరంగానే ఉంటారు. ఎన్టీఆర్ భార్య ప్రణిత కూడా సోషల్ మీడియాకు దూరంగానే ఉంటుంది. స్టార్ హీరో భార్యలు అంటే.. సోషల్ మీడియాలో క్రేజ్ ఉంటుంది.

Young Tiger NTR Shocking Decision about His Children news viral in social media

సోషల్ మీడియాకు దూరంగా: కానీ ఎన్టీఆర్ భార్య ప్రణిత.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది. ఉదహారణకు అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి.. ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించకపోయినా.. ఆమెకు స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉంటుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ కూడా ఎక్కువే. ఇక హీరోయిన్ కి మించిన అందంగా ఉంటుంది. ఇక ఆ విషయం పక్కన పెడితే... ప్రణిత మాత్రం ఇందుకు భిన్నంగా ఉంటుంది. తను సోషల్ మీడియాకు, పబ్లిసిటీకు దూరంగా ఉంటుంది.

Young Tiger NTR Shocking Decision about His Children news viral in social media

స్టార్ కిడ్స్ కు ప్రత్యేక క్రేజ్: ఇక సెలబ్రెటీస్ వారి పిల్లలను కూడా స్టార్లు చేసేందుకు ఆరాటపడుతుంటారు. సోషల్ మీడియాలో వారి ఫోటోలు షేర్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి వాటికి తారక్ కుటుంబం మాత్రం పూర్తి భిన్నం. ఇక తారక్ తన కొడుకుల విషయంలో పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. అప్పుడే వారికి సోషల్ మీడియా అలవాటు చేయకూడదనే నిర్ణయం తీసుకున్నారట. అందుకే సోషల్ మీడియాలో వారికి సంబంధించినవి పోస్ట్ చేయడంలేదని తెలుస్తోంది.

Young Tiger NTR Shocking Decision about His Children news viral in social media

ఎన్టీఆర్ షాకింగ్ నిర్ణయం: ముందు పిల్లలు బాల్యాన్ని ఎంజాయ్ చేసే విధంగా ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంతే కాదు ఏ మాత్రం సమయం దొరికినా పిల్లలతో టైం స్పెండ్ చేస్తారట ఎన్టీఆర్. ముఖ్యంగా భార్గవ్ రామ్ కు నాన్నతో ఆడుకోవడం ఇష్టమని తెలుస్తోంది. ఇక ఎప్పుడూ ఎన్టీఆర్ ఇంట్లో ఉన్నా.. భార్గవ్ రామ్ తో ఆడుకుంటూ ఉంటాడని సమాచారం. భవిష్యత్తుపై ఎలాంటి ఆలోచన లేదని.. ముందు వారి బాల్యన్ని ఎంజాయ్ చేయాలని తారక్ ఈ నిర్ణయం తీసుకున్నారని టాలీవుడ్ వర్గాల్లో ఈ విషయం చక్కర్లు కొడుతుంది.

Young Tiger NTR Shocking Decision about His Children news viral in social media

ఎన్టీఆర్ పిల్లలు: ఇక నందమూరి వారసులుగా ఎన్టీఆర్ కుమారులు తమ పేరును నిలబెడతారని తారక్ భావిస్తున్నారట. ఇప్పటికే తారక్ చిన్న కుమారుడు తన తాత డైలాగును వచ్చిరాని ముద్దు ముద్దు మాటలతో చెబుతూ ఆకట్టుకున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాకు దేవర అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X