మళ్లీ ఎన్టీఆర్‌కు గాయం.. RRR షూటింగ్ వాయిదా.. వెంటాడుతున్న ప్రమాదాలు
RRR చిత్రాన్ని ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ... ఇందులో లీడ్ రోల్స్ చేస్తున్న ఇద్దరు హీరోలు వరసుగా గాయాల పాలవుతున్నారు. ఇప్పటికే వీరి గాయాల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా మరో పుకారు ప్రచారంలోకి వచ్చింది.
ఎన్టీఆర్ గాయపడ్డారని, దీంతో డెహ్రాడూన్లో చిత్రీకరించాలనుకున్న షెడ్యూల్ వాయిదా పడినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే యంగ్ టైగర్ షూటింగులో గాయపడ్డారా? మరేమైనా కారణమా? అనే విషయంలో క్లారిటీ రాలేదు. సోషల్ మీడియాలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ఎన్టీఆర్ గాయంపై అఫీషియల్ సమాచారం లేదు
చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టెన్మెంట్స్ నుంచి కానీ... దర్శకుడు రాజమౌళి నుంచి ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అభిమానులు, ప్రేక్షకుల్లో నెలకొన్న అయోమయం తొలగిపోవాలంటే చిత్ర బృందం నుంచి అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది.

అభిమానుల్లో కన్‌ఫ్యూజన్
వాస్తవానికి డెహ్రాడూన్ షెడ్యూల్ గతంలో డైసీ ఎడ్గర్‌జోన్స్‌తో అనుకున్నారు. ఆవిడ తప్పుకోవడంతో ఈ షెడ్యూల్ పక్కన పెట్టారు. ఇపుడు ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామను ఎంపిక చేశారని, ఆమెతో డెహ్రాడూన్ షెడ్యూల్ ప్లాన్ చేయగా ఇపుడు ఎన్టీఆర్ గాయం కారణంగా దీన్ని రద్దు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అఫీషియల్ సమాచారం లేకపోవడంతో.. ఏం జరుగుతుందో తెలియక కన్‌ఫ్యూజన్ నెలకొని ఉంది.

అనుకున్న సమయానికి సినిమా వస్తుందా?
షెడ్యూల్ ప్రకారం RRR జులై 30, 2020లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే షూటింగ్ వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంతో ముందుగా అనుకున్న సమయానికి సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

RRR
1920 కాలం నాటి కథతో RRR చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నాడు. రూ. 350 కోట్ల నుంచి రూ. 400 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











