బిగ్ బాస్ 9లోకి పచ్చళ్ళ వంటలక్క.. కాంట్రవర్సియల్ యూట్యూబర్ ఎంట్రీ ఖాయమేనా?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి సాధారణం కంటే ముందుగానే ఈ సీజన్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రియాల్టీ గేమ్ షో అత్యంత ప్రేక్షకు ఆదరణ పొందడంతో ఇక రాబోయే సీజన్ ను మరింత పకడ్బందీగా నిర్వహించబోతున్నారు. గత సీజన్ బిగ్ బాస్ తెలుగు 8 ప్రేక్షకుల నుంచి ఆశించినంత మేరగా స్పందనను అందుకోలేకపోయింది. కానీ టిఆర్పి విషయంలో ఎక్కడ తగ్గలేదు. నిఖిల్ టైటిల్ తో పాటు 55 లక్షల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నారు. గౌతమ్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు. ఏదేమైనా గత సీజన్ ప్రేక్షకులను బాగానే అలరించింది. దీంతో నెక్స్ట్ సీజన్ పై ఆసక్తి నెలకొంది.

అయితే, బిగ్ బాస్ తెలుగు 9 వ సీజన్ ఈసారి కాస్త ముందుగానే ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తోంది. సాధారణంగా సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే ఈ రియాల్టీ గేమ్ షో, ఈ సీజన్ మాత్రం మేలో జరపాలని ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ గా చేసుకొని షో ను మరింత రసవత్తరంగా నడిపించేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ సీజన్లోకి రీసెంట్ గా సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యూట్యూబ్ ఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది.

Youtuber Alekhya Chitti Into Bigg Boss Telugu 9

ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు 9 వ సీజన్ కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపికపై టీం వర్క్ చేస్తున్నది. ఈ క్రమంలో యూట్యూబర్, అలేఖ్య చిట్టి పికిల్స్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల ఈమె సెన్సేషనల్ ఆడియో రిలీజ్ కావడంతో ఒక్కసారిగా ఫేమ్ అయిపోయింది. తన అధికారిక ఇంస్టాగ్రామ్ పేజీలో పెట్టిన పోస్ట్ కు ఒక నెటిజన్ దుర్భాషలాడుతూ కామెంట్ చేశాడు. అయితే ఆమె అతనికి అతని భాషలోనే తిరిగి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఆమె తిట్ల పురాణానికి సంబంధించిన వాయిస్ రికార్డ్ ఆ నెటిజన్ కు వెళ్లకుండా మరొక నెటిజన్ కు వెళ్ళింది.

దాంతో అతను ఆమె వాయిస్ రికార్డును పలు యూట్యూబ్ చానల్స్, మీమర్స్ కు చేరవేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అలేఖ్య చిట్టి సోదరి స్పందించింది. పొరపాటున అలా జరిగిందని, అది అతనికి వెళ్లాల్సిన మెసేజ్ కాదని చెప్పే ప్రయత్నం చేసింది. ఇలా అలేఖ్య చిట్టి పేరు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లో మార్మోగింది. ఆమె చాలామందికి తెలిసిపోయింది. ఇక మరోవైపు బిగ్ బాస్ తెలుగు 9 వ సీజన్లో కంటెస్టెంట్ల ఎంపికలోను పలు మార్పులు జరగడంతో ఈమెను ఎంపిక చేశారని తెలుస్తోంది.

బిగ్బాస్ తెలుగు రియాల్టీ షోకు ఇప్పటివరకు టీవీ స్టార్లు, సినిమా స్టార్లు, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు కంటెస్టెంట్లుగా ఎంపికయ్యారు. ఇక ఈసారి ఎక్కువ శాతం సినిమా నటులను ఎంపిక చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు సెన్సేషనల్ గా మారిన వారిని కూడా హౌస్ లోకి ఆహ్వానించే ప్రయత్నం జరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే అలేఖ్య చిట్టిని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావాలని నిర్ణయం జరుగుతున్నట్టు తెలుస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే విపరీతమైన నెగెటివిటిని ఎదుర్కొని నిలబడగలిగిన అలేఖ్య చిట్టికి బిగ్ బాస్ హౌస్ కరెక్ట్ గా సరిపోతుందని కొందరు అంటున్నారు. మరికొందరు ఆమెని మొదటి వారంలోనే ఎలిమినేట్ చేసేలా ఓటు వేస్తామని ముందే హెచ్చరిస్తున్నారు. ఇక ఈ సీజన్లో హోస్ట్ గా నాగార్జునకు బదులు రానా దగ్గుబాటి రాబోతున్నారని తెలుస్తోంది. మునుముందు ఈ విషయంపై మరిన్ని అప్డేట్స్ అందనున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X