వైఎస్ జగన్, ప్రభాస్ గురించి క్రేజీ రూమర్.. ఒకే వేదికపై!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రం యాత్ర విడుదలకు సర్వం సిద్ధం అవుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో ముఖ్యమంత్రి కాకముందు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 8న యాత్ర చిత్రం విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1న హైదరాబాద్ లో ఘనంగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించనున్నారు. ప్రీరిలీజ్ వేడుక గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

ఎమోషనల్‌గా
మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో ప్రజలతో మమేకమైన సన్నివేశాలని ఎమోషనల్ గా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి ఒదిగిపోయారు. పంచె కట్టు, రాజశేఖర్ రెడ్డిలా హావ భావాలతో అద్భుతంగా నటిస్తున్నారు. ట్రైలర్, టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.

ముఖ్య అతిథులుగా
ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కాబోయే చీఫ్ గెస్ట్ విషయంలో ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఏపీ ప్రతి పక్ష నేత వైఎస్ జగన్ తో పాటు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కూడా హాజరు కాబోతున్నట్లు క్రేజీ న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ దీనిపై ఇంతవరకు అధికారిక ప్రకటన రాలేదు. వైయేఎస్ఆర్ బయోపిక్ కాబట్టి చిత్ర యూనిట్ ఇప్పటికే జగన్ ని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ చిత్ర నిర్మాత విజయ్ చిల్లాకు ప్రభాస్ చిన్ననాటి స్నేహితుడు. దీనితో ప్రభాస్ ని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

అనుమానమే
జగన్, ప్రభాస్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరు కానుండడంపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. జగన్ తరఫునుంచి ప్రీరిలీజ్ ఈవెంట్ కు హాజరయ్యే విషయం ఇంకా ఖరారుకాలేదని అంటున్నారు. కనీసం ప్రభాస్ అయినా ప్రీరిలీజ్ ఈవెంట్ లో పాల్గొనేలా నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ కూడా సాహో చిత్రంతో బిజీగా ఉన్నాడు. చివరి నిమిషం వరకు కానీ ఏ విషయం అనేది తేలేలా కనిపించడం లేదు.

బయోపిక్ చిత్రాల హవా
ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతోంది. ఇప్పటికే బాలయ్య నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలోని మొదటి భాగం ఎన్టీఆర్ కథానాయకుడు నిరాశపరిచింది. దీనితో యాత్ర చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ చిత్రంలో అనసూయ, జగపతి బాబు, రావు రమేష్, సుహాసిని, పోసాని కీలక పాత్రల్లో నటించారు. కృష్ణ కుమార్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు.


Click it and Unblock the Notifications











