బిజినెస్ మ్యాన్ ఆడియోకు వైయస్ జగన్!?
బిజినెస్ మ్యాన్ ఆడియో డిసెంబర్ 23న జరగనుందనే సంగతి తెలిసిందే. ఈ ఆడియో ఫంక్షన్ కి వైయస్ జగన్ వస్తాడని అంతటా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్ మూవీ మేకర్స్ లో ఆయనకు షేర్స్ ఉన్నాయని అందుకే వెంకట్ అతన్ని పిలుస్తున్నారని చెప్తున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని అలాంటిదేమీ లేదని చెప్తున్నారు.ఇక మహేష్ బాబు దూకుడుతో పెరిగిన మార్కెట్ కు అణుగుణంగానే బిజినెస్ మ్యాన్ ఉండబోతోందని చెప్తున్నారు. అందులోనూ గతంలో మహేష్,పూరీ కాంబినేషన్ లో వచ్చిన పోకిరి మెగా హిట్ ఫిలిం కావటంతో ఈ సినిమాపై మరింత అంచనాలు ఉన్నాయి.
కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం ముంబై బ్యాక్ డ్రాప్ లో కథ నడవనుంది. తెలుగు,తమిళ్,మళయాళ భాషల్లో జనవరి 11 న ఈచిత్రం విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. దూకుడు ఆడియో మంచి విజయం సాధించటంతో అతన్నే ఈ సినిమాకు మహేష్ ఎంచుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నిమిత్తం వదిలిన ఫస్ట్ లుక్ ట్రైలర్ అందరి ప్రశంసలూ పొందుతోంది. ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో విడుదల అవనున్న ఈ చిత్రం సంక్రాంతి రేసులో విజేతగా నిలిచి దూకుడు రికార్డులను బ్రద్దలు కొడుతుందని మహేష్ ఫ్యాన్స్ సైతం ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











