twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీలో థియేటర్ టికెట్ల పెంపులో ట్విస్ట్.. మోసం చేస్తున్నారనే భావనలో #YSJagan.. అది తేలాకనే భేటీ?

    |

    తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సమస్యలలో ఒకటి ఆంధ్రప్రదేశ్ టికెట్ల వ్యవహారం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో మొదలైన ఈ వివాదం ఇప్పటికీ చల్లారలేదు.. అయితే త్వరలోనే చిరంజీవి ఆధ్వర్యంలో ఒక టాలీవుడ్ బృందం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలిసి ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ రావచ్చని అందరూ భావించగా ఆ భేటీ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. అయితే తాజాగా వైఎస్ జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే

    అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదుఅషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు

    వకీల్ సాబ్ తో మొదలు

    వకీల్ సాబ్ తో మొదలు

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమా పెద్ద ఎత్తున విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేశారు. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలకు భారీగా రేట్లు ఫిక్స్ చేసినట్లు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.. అయితే రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వన్ బెనిఫిట్ షో లకు అనుమతి ఇవ్వక పోవడమే కాక టికెట్ రేట్లు కూడా ఇష్టం వచ్చినట్లు అమ్మి ప్రజలను ఇబ్బంది పెడతాము అంటే ఊరుకునేది లేదు అంటూ టికెట్ రేట్లను నిర్ణయిస్తూ ఒక జీవో జారీ చేసింది. అప్పట్లో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్ళినా సరే కోర్టు కూడా ఏమీ తేల్చని పరిస్థితి నెలకొంది.

    Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవి హాట్ ఫొటోలు.. 'కార్తీక దీపం'లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవి హాట్ ఫొటోలు.. 'కార్తీక దీపం'లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

    ప్రతినిధి బృందం వైఎస్ జగన్ వద్దకు

    ప్రతినిధి బృందం వైఎస్ జగన్ వద్దకు

    ఈ వకీల్ సాబ్ సినిమా థియేటర్ల నుంచి తప్పుకున్నాక కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసి గ్రామీణ ప్రాంతాల్లో థియేటర్లకు ఒక రేటు, పట్టణ ప్రాంతాల థియేటర్లకు ఒక రేటు, మల్టీప్లెక్స్ లకు ఒక రేటు ఇలా రకరకాల రేట్లు ఫిక్స్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది.. అయితే ఒక పక్క నిర్మాతలు మొదలు డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యజమానులు సైతం ప్రభుత్వం చెప్పిన రేట్లకు థియేటర్ లను నడిపితే పూర్తిగా నష్టపోతామని దానికంటే థియేటర్లు మూసుకోవడమే నయం అని చెబుతున్నారు.

    ఈ నేపథ్యంలోనే పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి భయపడుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం వైఎస్ జగన్ వద్దకు వెళ్లి తమ సమస్యలు అన్ని విన్నవించి ఈ టిక్కెట్లను పెంచే విషయం మీద అభ్యర్ధించాలని ఒక నిర్ణయానికి వచ్చారు.

    Bigg Boss Telugu 5: మీరెప్పుడు చూడని ఆనీ మాస్టర్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్Bigg Boss Telugu 5: మీరెప్పుడు చూడని ఆనీ మాస్టర్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

    అపాయింట్మెంట్ క్యాన్సిల్

    అపాయింట్మెంట్ క్యాన్సిల్

    చిరంజీవి ఆధ్వర్యంలో వెళ్ళబోతున్న ఈ బృందంలో చిరంజీవి, నాగార్జున, సురేష్ బాబు అలాగే నిర్మాతల మండలికి చెందిన కొందరు పెద్దలు, అదే విధంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి హీరోలు తీసుకువెళ్తారు అనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 4వ తేదీన ఈ భేటీకి ఒక ముహూర్తం ఉంది అని గతంలో ప్రచారం జరిగినా ఆ ప్రచారం ప్రచారానికే పరిమితం అయింది.

    ఎందుకంటే ఆ రోజున జగన్ బిజీగా ఉండడంతో వాళ్లకు అపాయింట్మెంట్ క్యాన్సిల్ అయ్యిందని ప్రచారం కూడా తెరమీదకు వచ్చింది.. ఇప్పుడు పూర్తిగా కొత్తగా ఉన్న ఒక వెర్షన్ అయితే తెర మీదకు వచ్చింది. అయితే ఇదంతా జరుగుతూ ఉండగా నిన్న వైఎస్ జగన్ ను టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా కలిసి కాసేపు సమయం గడిపారు. ఆ తర్వాత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆయన ఇలాంటి విజనరీ లీడర్ ని కలవడం ఆనందంగా ఉందని కూడా చెప్పుకొచ్చారు.

    Indian Idol fame Shanmukhapriya కు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్Indian Idol fame Shanmukhapriya కు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్

    జగన్ కి కొత్త అనుమానం

    జగన్ కి కొత్త అనుమానం

    అయితే జగన్ కు మంచు మనోజ్ కుటుంబం బంధువులు కావడంతో బహుశా ఆ బంధుత్వంతో ఆయన అక్కడికి వెళ్లి ఉండవచ్చు అని అందరూ భావించారు. కానీ టాలీవుడ్ పెద్దలకు సమయం ఇవ్వకుండా మంచు మనోజ్ కి సమయం ఇవ్వడం అనే విషయం మీద కూడా చర్చ జరిగింది, బంధుత్వం ఉందనే కారణంతో టాలీవుడ్ పెద్దలు సమాధాన పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాజా నివేదికల ప్రకారం, తెలుగు పరిశ్రమ నుంచి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. తెలుగు సినిమాల నుంచి పన్ను ఆదాయం 20 కోట్లకు మించడం లేదని తెలుస్తోంది.

    Recommended Video

    Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Filmibeat Telugu
    మోసం చేస్తున్నారని

    మోసం చేస్తున్నారని

    తెలుగు పరిశ్రమ తక్కువ పన్నులు చెల్లించి మోసం చేస్తున్నారని జగన్ భావిస్తున్నారని, వందల కోట్ల కలెక్షన్లు అంటూ ఊదరగొట్టే వారు కేవలం 20 కోట్లు పన్ను చెల్లించడం ఏమిటి అని విషయం మీద ఆయన అనుమానం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అయితే ఇదంతా ప్రచారమే కాగా దీనికి సంబంధించి పూర్తి సమచారం అందాల్సి ఉంది.

    ఈ విషయం మీద దృష్టి పెట్టిన ఆయన ఈ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాక అప్పుడే టికెట్ ధరలపై తదుపరి చర్యలు తీసుకుంటారని అంటున్నారు. అయితే అసలు ఈ టికెట్ల విషయం మీద పరిస్థితులు, పరిణామాలు ఎంత దూరం వెళతాయి ? అసలు ఏం జరగబోతోంది అనే విషయం మీద మాత్రం పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. మరి జగన్ ఎప్పుడు టాలీవుడ్ పెద్దలు భేటీ జరగనుంది అనేది కూడా ఇప్పుడు ఆశ్చర్యకరంగా మారింది. చూడాలి ఏం జరగనుంది అనేది.

    English summary
    As per reports CM YS Jagan Enquired about the revenue Govt would get from Telugu Industry. Tax revenue from Telugu films has been not more than 20 Crores. Jagan Felt that Industry Cheating Govt by paying less taxes
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X