వైయస్ జగన్ సమర్పణలో ప్రిన్స్ మహేష్ బాబు
ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో ఓ చర్చనీయాశం, తెలుగు పరిశ్రమ ఎంతో అట్టహాసంగా నిర్వహించిన స్టార్ నైట్ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరు కాకపోవడమే దీనికి కారణం. అంతేకాకుండా రెండు సంవత్సరాలుగా మహేష్ సినిమా ఏదీ రిలీజ్ కాకపోవడం ఇంకో కారణం. తెలుగు అభిమానులు మహేష్ బాబును మరచిపోతున్నారు అనే పుకార్లు కూడా వినిపుస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 'కిలాడి" సినిమాతో బిజీగా ఉన్నారు. మగధీర సక్సెస్ తో టాలీవుడ్ లో దర్శకధీరుడిగా నిలిచిన రాజమౌళి ప్రస్తుతం సునీల్ తో 'మర్యాదరామన్న" సినిమాతో బిజీగా వున్నారు. దీని తర్వాత మహేష్ బాబుతో ఓ చిత్రాన్ని చేయనున్నరని సమాచారం. అయితే ఆ సినిమాని వై. యస్ జగన్ సమర్పణలో ఓ పారిశ్రామిక వేత్త నిర్మాతగా నిర్మించనున్నారనేది సినీ వర్గాల విశ్వసనీయ సమాచారం.
More from Filmibeat
వైయస్ జగన్ మహేష్ బాబు రాజమౌళి మగధీర సునీల్ మర్యాదరామన్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కిలాడి ys jagan mahesh babu rajamouli magadheera sunil maryadaramanna trivikram srinivas


Click it and Unblock the Notifications











