షాకింగ్.. వైఎస్ఆర్ బయోపిక్ నుంచి జగన్ అవుట్, దర్శకుడి సంచలన నిర్ణయం!

ప్రస్తుతం టాలీవుడ్ లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. వరుసగా తెలుగు ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా చిత్రాలు రూపొందుతున్నాయి. ఇటీవల సావిత్రి బయోపిక్ గా వచ్చిన మహానటి చిత్రం ఘన విజయం సాధించింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. సైరా నరసింహారెడ్డిగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇదిలా ఉండగా తెలుగు రాజకీయ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలు లిఖించుకున్న ఎన్టీఆర్, వైఎస్ఆర్ బయోపిక్స్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ బయోపిక్ గురించి సంచలన వార్త బయటకు వచ్చింది.

పాదయాత్ర నేపథ్యంలో

పాదయాత్ర నేపథ్యంలో

వైఎస్ఆర్ బయోపిక్ చిత్రం యాత్ర టైటిల్ తో రూపొందుతోంది. మహి వి రాఘవ్ ఈ చిత్రానికి దర్శకుడు. 2003 లో వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసిన పాదయాత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పాదయాత్రలోని ముఖ్యఘట్టాలని ఈ చిత్రంలో చూపించబోతున్నారు.

 మలయాళీ మెగాస్టార్

మలయాళీ మెగాస్టార్


మలయాళీ మెగాస్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వైఎస్ఆర్ మ్యానరిజమ్స్ తో మమ్ముట్టి అదరగొడుతున్నాడు.

 జగన్ పాత్రపై ఉత్కంఠ

జగన్ పాత్రపై ఉత్కంఠ


ఈ చిత్రంలో వైఎస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి పాత్రలో ఎవరు నటిస్తారు అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్న చిత్రం కావడంతో జగన్ పాత్రలో ఎవరి కనిపిస్తారని అంతా చర్చించుకుంటున్నారు. తమిళ హీరో సూర్య లేదా కార్తీ నటించే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.

 సంచలన నిర్ణయం

సంచలన నిర్ణయం

ఇదిలా ఉండగా చిత్ర దర్శకుడు మహి వి రాఘవ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జగన్ పాత్రని తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ కథ నుంచి దృష్టి మరల్చకుండా ఉండేందుకే ఈ చిత్రంలో జగన్ పాత్ర ఉంచడం లేదట. సినిమా మొత్తం వైఎస్ఆర్ చరిత్రపైనే ఫోకస్ చేయాలనీ దర్శకుడు భావిస్తున్నాడని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి.

Recommended Video

YSR Biopic : Vijay Devarakonda As YS Jagan...?
జగన్ పాత్ర ఉంటే

జగన్ పాత్ర ఉంటే

వేరే నటుడిని తీసుకుని వచ్చి జగన్ పాత్రలో నటింపజేయడం వలన అందరిదృష్టి అతడిపై పడుతుంది. దీని వలన బయోపిక్ చిత్ర ప్రయోజనం ఉండదు. అందుకే జగన్ రోల్ లేకుండానే ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాదయాత్ర, ముఖ్యమంత్రిగా ఎదిగిన కథని చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X