twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కెమెరామన్ గంగతో రాంబాబు' లో విలన్ చంద్రబాబు?

    By Srikanya
    |

    హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కెమెరామన్ గంగతో రాంబాబు' నిన్న(గురువారం) భారీ ఎత్తున అభిమానులను ఆనందం కలగచేస్తూ విడుదల అయిన సంగతి తెలిసిందే. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం పొలిటికల్ సెటైర్ గా సాగింది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ పోషించిన విలన్ పాత్ర చంద్రబాబు నాయుడుని పోలి ఉందని అంతటా వినిపిస్తోంది. ఆ పాత్ర పేరు రానా బాబు దీన్ని తిరగేస్తే నారా బాబు అని వస్తుందని కావాలనే ఈ పేరు పెట్టారని వినిపిస్తోంది. అలాగే ...ప్రకాష్ రాజ్ తండ్రి పాత్ర కోట శ్రీనివాస రావు చేసారు. ఆ పాత్ర రెండు సార్లు ముఖ్యమంత్రి చేసి ప్రస్తుతం మాజీ సీఎం పాత్ర. అలాగే ప్రకాష్ రాజ్ పాత్ర ఓ సారి మాకు టెన్షన్ లతోనే బొల్లి,సుగర్,బీపీ వంటివి వస్తాయి అంటుంది. ఇవన్నీ చంద్రబాబుని ఉద్దేశించే అంటున్నారు.

    ఇక మరో పాత్ర మంచి ముఖ్యమంత్రి పాత్ర. ఆ పాత్రను నాజర్ పోషించారు. ఆ పాత్ర..పేరు చంద్ర శేఖర్ రెడ్డి. తనకు వైయస్ కుటుంబంపై ఉన్న అభిమానంతో ఆ పాత్రను తీర్చి దిద్దాడంటున్నారు. ఆ పాత్ర వైయస్ లా పంచుకట్టుతో ఉంటూ పాద యాత్ర చేసి అధికారంలోకి వచ్చి ఉంటుంది. అలాగే రాష్ట్లంలో ఏ మూల ఏముందో,ఎవరి కష్టాలు ఏమిటో తనకు పాదయాత్ర ద్వారా తెలిసాయంటుంటుంది. మరో ప్రక్క తెలంగాణా ఉద్యమాన్ని కూడా అన్యాపదేశంగా సెటైర్స్ వేసారనే వాదన కూడా వినిపిస్తోంది.

    'గబ్బర్‌సింగ్' తర్వాత కల్యాణ్ నుంచి వచ్చిన సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు హెవీగా ఉన్నాయి. ఆ అంచనాలు అన్నిటినీ మించి ఈ చిత్రం ఉంటుందని హామీ ఇచ్చి మరీ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఈ చిత్రాన్ని బరిలోకి దించారు. అలాగే కల్యాణ్‌కీ, నాకూ 'కెమెరామన్ గంగతో రాంబాబు' కెరీర్ బెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని చెప్తున్నారు.

    కథ చూస్తే... ఓ మామూలు కారు మెకానిక్ నుంచి చానల్ రిపోర్టర్‌గా మారిన రాంబాబు కథ. అందరూ చదివి వదిలేసే వార్తల్ని రాంబాబు సీరియస్‌గా తీసుకుని, వాటికి రియాక్ట్ అవుతుంటాడు. గంగ అనే కెమెరా(ఉ)మన్ వల్ల చానల్ రిపోర్టర్ అవుతాడు. ఒక రాజకీయ నాయకునికీ, అతనికీ మధ్య జరిగే గొడవ ఈ సినిమా. మీడియాని వాడుకుని ఆ రాజకీయ నాయకుడు ఎదగాలనుకుంటే, అదే మీడియాని వాడుకొని రాంబాబు అతన్ని ఎలా అడ్డుకున్నాడనేది ఆసక్తికరమైన పాయింట్.

    English summary
    pawan kalyan's 'Cameraman Gangatho Rambabu' was released yesterday across the globe and generated positive reports. Since the theme of the movie mostly based on current politics in the state, director Puri Jagannadh seems to have shown his views on two big political heads of the state in the movie. Nasser essayed the role of CM in the movie. His character reminds us late CM YS Rajasekhar Reddy, as, in one of the scenes, Tanikella Bharani says, Nasser has become a CM of the state due to his Paadayatras. We have also one more political character in the movie and it was played by Kota Srinivasa Rao. As per the story, he was the CM of the state for two times and he is an opposition leader now. This character reminds us former CM, N.Chandrababu Naidu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X