ఆ స్టార్ హీరో ఇంటి కోడలిగా రోజా కుమార్తె .. పెద్ద టార్గెట్ పెట్టుకుందిగా, కూతురి మైండ్‌లో అదే?

ఒకప్పుడు సౌతిండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు రోజా. హేమాహేమీలు ఉన్న ఇండస్ట్రీలో, పెద్దగా అందగత్తె కాకపోయినా, ఎలాంటి గాడ్ ఫాదర్ లేకపోయినా కేవలం తన కష్టాన్ని నమ్ముకుని ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన రోజా కుటుంబం తర్వాతి రోజుల్లో హైదరాబాద్‌కు షిప్ట్ అయ్యింది. పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ చేసిన రోజా.. కూచిపూడి నృత్యంలో ప్రావీణ్యురాలు. సినిమాల్లోకి రాకముందు ఎన్నో స్టేజ్ షోలు ఇచ్చి శెభాష్ అనిపించుకున్నారు.

అనంతరం నటనపై ఆసక్తితో ప్రేమ తపస్సు అనే చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. తర్వాత సీతారత్నం గారి అబ్బాయి సినిమాతో రోజాకు బ్రేక్ వచ్చింది. అనంతరం భైరవ ద్వీపం, ముఠామేస్త్రి, ముగ్గురు మొనగాళ్లు, పెద్దన్నయ్య, గాండీవం, బొబ్బిలి సింహాం, శుభలగ్నం, ఘటోత్కచుడు, అన్నమయ్య, సుల్తాన్ వంటి సినిమాలతో టాప్ హీరోయిన్‌గా వెలుగొందారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించారు.

ysrcp leader rk roja made sensational comments on her daughter anshumalika selvamani

కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలోనే దర్శకుడు ఆర్కే సెల్వమణితో ప్రేమలో పడి ఆయనతో సుదీర్ఘకాలం డేటింగ్ తర్వాత పెద్దల అంగీకారంతో మూడు ముళ్ల బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. తొలి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉండటం, పైగా రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న రాయలసీమకు చెందిన వ్యక్తి కావడంతో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. తన వాగ్థాటి, విషయ పరిజ్ఞానంతో తెలుగు మహిళ అధ్యక్షురాలి స్థాయికి ఎదిగి ఎన్నో ప్రజా పోరాటాలు చేశారు.

2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాతి చోటు చేసుకున్న పరిణామాలతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని అనుకున్నప్పటికీ కుదరకపోవడంతో వైఎస్ జగన్ సారథ్యంలోని వైసీపీలో చేరారు. 2014, 2019లలో నగరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన రోజా ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా, మంత్రిగా సేవలందించారు. అయితే 2024 ఎన్నికల్లో ఓటమి పాలవ్వడంతో హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కలలు కల్లలయ్యాయి. ఓటమి తర్వాత కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న రోజా ఇటీవల మళ్లీ యాక్టీవ్ అయ్యారు.

రోజా- సెల్వమణి దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె అన్షుమాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ సెల్వమణి. వీరిద్దరూ ప్రస్తుతం ఉన్నత చదువుల్లో బిజీగా ఉన్నారు. ఇక అన్షు తల్లిని మించిన అందంతో వెలిగిపోతూ అప్పుడప్పుడూ ఆమెతో కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుమార్తె గురించి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఓ స్టార్ హీరో ఇంటికి కోడలిగా మీ అమ్మాయి వెళ్లోబోతోందా అని యాంకర్ ప్రశ్నించగా రోజా షాక్ అవుతారు.

ఈ గాసిప్స్ నిరాధారమని ఆమె కొట్టిపారేశారు. ప్రస్తుతం తన కుమార్తె చదువుకోవడానికి అమెరికాకు వెళ్లిందని కానీ.. నటనలో, డ్యాన్స్‌లో శిక్షణ కోసం ఫారిన్ వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయని రోజా తెలిపారు. తనలాగే యాక్టర్ కావాలని ఆమె అనుకుంటే సంతోషమేనని.. కానీ తన కూతురికి సైంటిస్ట్ కావాలన్నది కల అన్నారు. ఆమె ఇష్ట ప్రకారమే చదువుకుంటుందని .. మా అభిప్రాయాలను పిల్లలపై రుద్దమని రోజా తేల్చిచెప్పారు . ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X