రామ్ చరణ్ ఫ్యాన్స్ కు YSR సెంటిమెంట్ భయం

By Srikanya

హైదరాబాద్: సెంటిమెంట్లే సినీ పరిశ్రమను శాసిస్తూంటాయి. ఇన్నాళ్లూ హీరోలకే ఉన్న సెంటిమెంట్ ఈ మధ్య కాలంలో వారి అభిమానులకు సైతం పాకింది. ఎందుకంటే వారు ప్రతీ ప్రాజెక్టుని ప్రారంభమైన రోజు నుంచి అప్ డేట్స్ ని ఫాలో అవుతున్నారు. తాజాగా రామ్ చరణ్ ఫ్యాన్స్ ని YSR సెంటిమెంట్ భయపెడుతోంది. YSR అంటే యవన్ శంకర్ రాజా. ఆయన్ను రీసెంట్ గా రామ్ చరణ్ కొత్త ప్రాజెక్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమన్ హఠాత్తుగా తప్పుకోవటంతో యవన్ శంకర్ రాజాని తీసుకోవాలని కృష్ణ వంశీ భావిస్తున్నట్లు సమాచారం. అఫీషియల్ గా ఈ విషయం బయిటకు రాకపోయినా తమన్,కృష్ణ వంశీల మధ్య క్రియేటివ్ క్లాష్ వచ్చిందని చెప్పుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఊహించని విధంగా యవన్ పేరు బయటకు వచ్చింది. ఈ మధ్య కాలంలో యవన్ చేసిన సినిమాలు ఏవీ తెలుగులో ఆడలేదు.

ముఖ్యంగా మెగా హీరోలతో అప్పట్లో అల్లు అర్జున్ తో చేసిన హ్యాపీ ..జస్ట్ యావరేజ్ అనిపించుకుంటే, పవన్ ..పంజా వర్కవుట్ కాలేదు. ఈ నేపధ్యంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ కొందరు యవన్ ని తీసుకోకుండా ఉంటే బెస్ట్ అంటున్నారు. ఎంత మంచి మ్యూజిక్ ఇచ్చినా, తెలుగువారి టేస్ట్ కు తగినట్లు ఇవ్వరనే కంప్లైంట్ వారిపై ఉంది.

Yuvan Shankar Raja Sentiment Scaring Ram Charan Fans

రామ్ చరణ్,కృష్ణ వంశీ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం టైటిల్ ని 'గోవిందుడు అందరివాడేలే' అని ఖరారు చేస్తూ పోస్టర్స్ విడుదల చేసారు. ఈ టైటిల్ గతంలో చిరంజీవి చిత్రం అందరివాడులోని టైటిల్ సాంగ్ నుంచి తీసుకున్నది కావటం విశేషం. కాజల్‌ హీరోయిన్.

కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో చరణ్‌ పల్లెలో అడుగుపెట్టే ఎన్నారై పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. యూనిట్‌ కన్యాకుమారి, పొలాచ్చి షెడ్యూల్స్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరింది. ఏప్రిల్‌ రెండోవారం నుంచి హైదరాబాద్‌ రామానాయుడు సినీవిలేజ్‌లో ఇల్లు సెట్‌లో, ఆర్‌ఎఫ్‌సిలో తదుపరి షెడ్యూల్‌ని చిత్రీకరిస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''తెలుగుదనం ఉట్టిపడే కథ కథనాలతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇటీవలే కన్యాకుమారి, పొల్లాచ్చి, రామేశ్వరంలో కీలక సన్నివేశాలు తెరకెక్కించాం. రామోజీఫిల్మ్‌సిటీలో కొంతభాగం తెరకెక్కిస్తాం. విదేశాల్లో పాటల్ని చిత్రీకరిస్తాం. రామ్‌చరణ్‌, రాజ్‌కిరణ్‌, శ్రీకాంత్‌ల మధ్య తెరకెక్కించిన సన్నివేశాలు.. ఇంటిల్లిపాదినీ ఆకట్టుకొనేలా ఉన్నాయి'' అన్నారు.

చాలా కాలం తర్వాత సొంతగడ్డపై అడుగుపెట్టిన ప్రవాస భారతీయుడిగా పోనీ టెయిల్‌తో కనిపించబోతున్నాడు రామ్‌చరణ్‌. తాత, మనవడుగా రాజ్‌కిరణ్‌, చరణ్‌ల నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలవబోతోంది. ఇందులో ప్రధాన పాత్రధారుల ఆహార్యం, ఆభరణాలు అన్నీ కొత్తగా ఉండబోతున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌ పంచెకట్టుతో ఎడ్లబండిపై తన తాత పాత్రధారి రాజ్‌కిరణ్‌తో తిరుగుతూ కనిపిస్తాడు.

ఈ చిత్రంలో తమిళంలో విలక్షణ నటుడుగా పేరుగాంచిన రాజ్ కిరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా, శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నటినటులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాత: బండ్ల గణేష్, సమర్పణ: శివబాబు గండ్ల, దర్శకత్వం: కృష్ణవంశీ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X