సల్మాన్‌ఖాన్ సిస్టర్‌తో యువరాజ్‌సింగ్ డేటింగ్?
తన అద్భుతమైన ఆటతీరుతో పాటు...బాలీవుడ్ భామలతో ఎపైర్లు నడిపిస్తూ తరచూ వార్తలో నిలుస్తుంటాడు క్రికెటర్ యువరాజ్ సింగ్. ఆ మధ్య సెక్సీగర్ల్ దీపిక పడుకొనెతో మనోడు నడిపించి తెరచాటు వ్యవహారం గురించి ఎంత చెప్పినా తక్కవే. తాజాగా మరో భామతో లింకు పెట్టుకుని వార్తల్లోకెక్కాడు యూవీ. బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్ ఖాన్ చిన్న చెల్లెలు అర్పితతో యువరాజ్ 'సం"బంధం నడిపిస్తున్నాడని ముంబై మిర్రర్ సోమవారం ఒక కథనాన్ని ప్రచురించింది. సౌత్ ఢిల్లీ చాణక్య పురిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఆదివారం సాయంత్రం ఇద్దరు ఏకాంతంగా గడిపారని, చాలా సేపు ఊసులాడుకున్నారని, వీళ్ల మధ్య ఏదో ' సం"బంధం లేనిదే వ్యవహారం ఇంత వరకు వచ్చిందా? అనేది ఆ కథనం సారాంశం.
యువరాజ్ కు సల్మాన్ కుటుంబంతో చాలా కాలం నుంచి సాన్నిహిత్యం ఉంది. ఈ నేపథ్యంలోనే అర్పిత, యూవీ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అది కాస్త ముదిరి డేటింగ్ కు దారి తీస్తోందని బాలీవుడ్ వర్గాల గుసగుస. అయితే యూవీ మాత్రం ఈ వార్తలను ఖండించారు. అర్పిత తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని స్పష్టం చేశాడు. ఇలాంటి ఆధారం లేని రూమర్లను పనిగట్టుకుని ప్రచారం చేశారని మీడియాను కోరారు. ఇక పోతే ఈ వార్తలపై స్పందించడానికి అర్పిత అందుబాటులో లేదని ముంబై మిర్రర్ పేర్కొంది.


Click it and Unblock the Notifications











