మోహన్ బాబు పై వైవియస్ చౌదరి కంప్లైంట్
మోహన్ బాబు నిర్మాతగా మంచు విష్ణు వర్ధన్, ఇలియానా కాంబినేషన్ లో వైవియస్ చౌదరి సలీం చిత్రం నిర్మించిన సంగతి తెలిసిందే. రిలియన్స్ భాగస్వామ్యంతో చేసిన ఈ చిత్రం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక ప్రస్తుతం వైవియస్ చౌదరి తనకు డైరక్టర్ రెమ్యునేషన్ నిమిత్తం నలభై లక్షలు బ్యాలన్స్ ఇవ్వవలసి ఉందని, ఆ ఫైనల్ పేమెంట్ మోహన్ బాబు క్లియర్ చేయలేదని డైరక్టర్స్ అశోషియేషన్ లో కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మోహన్ బాబు ఇచ్చిన చెక్ బ్యాంక్ లో సరిపడ ఫండ్స్ లేక క్లియర్ కాలేదని..అందుకే చెక్స్ బౌన్స్ అయిందని ఆ విషయం మోహన్ బాబుకు లిఖిత పూర్వకంగా చౌదరి తెలియబర్చారని ఆ కంప్లైంట్ ఉందనేది సమాచారం. ఇక డైరక్టర్స్ అశోషియేషన్ వారు ఈ కంప్లైంట్ ని నిర్మాతల మండలికి పార్వార్డ్ చేసారు. ఇక డబ్బు విషయంలో మోహన్ బాబు ఒప్పుకున్న మేరకు ఇచ్చేస్తారని, ప్రామ్ట్ గా ఉంటారనేది పేరు ఉంది...మరి ఈ సంఘటన ఎలా చోటుచేసుకుందో పరిశీలించాలి అంటున్నారు సినీ జనం.


Click it and Unblock the Notifications











